🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 228 / Agni Maha Purana - 228 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 67
🌻. జీర్ణోద్ధారవిధి కథనము 🌻
హయగ్రీవుడు చెప్పెను - ఇప్పుడు జీర్ణోద్ధార విధిని చెప్పెను. ఆచార్యుడు మూర్తికి అలంకరించి స్నానము చేయించవలెను. అత్యంతము జీర్ణమైనది, అంగవిహీనము, భగ్నమైనది, శిలామాత్రావశిష్టమైనది, అగు ప్రతిమను పరిత్యజించవలెను. దీని స్థానమునందు వెనుకటి వలెనే నవీనమైన స్థిరమూర్తిని స్థాపింపవలెను. ఆచార్యుడు భూతశుద్ధిప్రకరణములో చెప్పిని విధమున, సంహారవిధిచే సకల తత్త్వముల సంహారము చేయవలెను. నృసింహా మంత్రముతో వేయి హోమము చేసి మూర్తిని పెకిలించవలెను. దారుమయ మూర్తియైనచో అగ్నిచే దహింపచేయవలెను. శిలా నిర్మితమూర్తియైనచో యైనచో జలములు విడువలెను. ధాతుమయమూర్తి గాని, రత్నమయమూర్తి గాని ఐనచో సముద్రములో ఆగాధ జలములో పడవేయవలెను. జీర్ణప్రతిమను వాహనముపై ఎక్కించి, వస్త్రాదులచే కప్పి, వాథ్యములతో తీసికొని వెళ్ళి నీటిలో విడువవలెను. పిమ్మట ఆచార్యునకు దక్షిణ ఈయవలెను. అదివసమునందే వెనుకటి ప్రతిమ దేనిచేత నిర్మింపబడినచో, ఎంత ప్రమాణము కలదో అదే ద్రవ్యముతో, అంతే ప్రమాణము గల మూర్తిని స్థాపించవలెను. ఈ విధముగనే జీర్ణ కూప-వాపీ-తడాగాదుల ఉద్ధారముచేయుటచే గొప్ప ఫలము లభించును.
శ్రీ అగ్నిమహాపురాణమునందు జీర్ణోద్ధారవిధి కథనమను ఆరువది యేడవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 228 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 67
🌻Renovation of decayed images (jīrṇoddhāra) 🌻
The Lord said:
1. I shall describe the process of replacing the old images. The priest should bathe the images with their ornaments on them. The fixed class of images should be put in a room and the extremely time-worn ones should be rejected.
2. A broken or mutilated stone (image) (should be cast aside) and a new one the same as the previous one should be installed (in its place) by the priest after merging the principles according to the process of merging (described earlier).
3. Having made one thousand oblations with the Narasiṃha (mantra), the priest should lift that image. The old image made of wood should be put into fire and the one made of stone should be thrown into water.
4. The old image made of a mineral or gem should be carried on a vehicle after covering it with cloth etc. and be discarded in the deep waters of the ocean.
5. It [i.e., jīrṇoddhāra] should be thrown into waters accompanied by the notes of music instruments. Fees should be paid to the priest.
6. New images of the same size and made of the same material should be installed on the same day. One accrues great merit by the renovation of wells, tanks and ponds.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments