🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 229 / Agni Maha Purana - 229 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 68
🌻. ఉత్సవవధి కథనము -1 🌻
హయగ్రీవుడు పలికెను. ఇప్పుడు ఉత్సవ విధిని చెప్పెదను. ఉత్సవము లేని దేవతాప్రతిష్ఠ నిష్ఫలము, అందుచే దేవతాస్థాపనము చేసిన సంవత్సరమునందే ఏక రాత్రోత్సవము లేదా త్రిరాత్రోత్సవము లేదా అష్ఠరాత్రోత్సవము చేయవలెను. అయనసమయమునందు గాని, విషువసంక్రాంతి సమయమునందు గాని శయనోపవనమునందు లేదా దేవతా గృహమునందు లేదా కర్తకు అనుకూలముగా ఉన్న విధమున దేవుని నగరయాత్ర చేయించవలెను. ఆ సమయమున మంగలాంకురారోపణము, నృత్యగీతాదులు, వాద్యములు ఏర్పాటు చేయవలెను. అంకురారోపణమునకు మూకుళ్ళు ఉత్తమమైనవి. యవ - శాలిజ - తిల - ముద్గగోధూమ - శ్వేతసర్షప - కులత్థ - మాష - నిష్పావములు కడిగి చల్లవలెను.
దీపములతో రాత్రి ఊరేగుచు ఇంద్రాదిదిక్పాలులకు, కుముదాది దిగ్గజములకు, సకల ప్రాణులకు పూర్వాదిదిక్కులందు బలి ప్రదానము చేయవలెను. దేవతా విగ్రహమును మోయుచు దేవయాత్రను అనుసరించు వారికి అడుగడుగునకు అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును, కొంచెమైనను సందేహము లేదు. ఆచార్యుడు తొలుచటి దివసమున దేవాలయమునకు వచ్చి దేవునితో - ''దేవశ్రేష్ఠా! రేపు నీ తీర్థ యాత్ర జరుపవలసి యున్నది. అందుకు అనుజ్ఞ ఇచ్చుటకై నీవు సర్వదా సమర్ధుడవు అని నివేదించి ఉత్సవకార్యము ప్రారంభింపవలెను. నాలుగు స్తంభములు గలదియు అంకురములున్న ఘటముతో కూడినదియు అలంకరింపబడినదియు అగు వేదిక దగ్గరకు వెళ్ళి దాని మధ్య భాగమున స్వస్తికము ప్రతిమనుంచి, తన కోరికను వ్రాసి చిత్రములపై స్థాపించి అధివాసము చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 229 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 68
🌻Mode of taking out a procession and celebration of festivals -1 🌻
The Lord said:
1. I shall describe the celebration of festival after the image has been installed. It shall be for a night, or three or five nights.
2-3. Without the festival the installation would become fruitless. The festival for the deity [i.e., utsava] should be celebrated when the sun enters the solstitial or the equinoctial points in the bedchamber or garden or it may be done in favour of the person at whose instance the ceremony is performed with the sowing of auspicious seeds and the notes of sacred music.
4-5. An earthen vessel, a small water pot or an embankment are suitable for the sowing of seeds. Grains of barley, uncultivated rice, sesamum, green gram, wheat, white mustard, horsegram, and black gram should be winnowed, washed and sown. Offerings should be made in the east and other directions. Lighted lamps should be carried round the edifice in the night.
6. (Offering should be made) to Indra, Kumuda and other -deities and spirits. They visit the place assuming shapes of men.
7. (One who carries such lamps) certainly gets the merit of (doing) aśvamedha (horse sacrifice) for every step he places. The priest should submit to the lord (as follows) after his return.
8. “O Lord! best among the Gods! you have to be taken in a procession tomorrow [i.e., tīrtha-yātrā]. By all means you deserve to permit us O Lord! to commence the same.
9. Having informed the lord in this way the festivities should be undertaken. The platform should be decorated with young shoots of plants and small water-jar.
10-11. Four pillars (should be erected). The image should be placed in a svastika (figure) (drawn) in their midst. Or desired objects should be painted and placed there and the act of making the deity present in the image should be done with the vaiṣṇava mantra. (The image) should be anointed with ghee with (the recitation of) the principal (mantra). Or the wise man should arrange an incessant flow of ghee over the image the whole night.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments