🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 232 / Agni Maha Purana - 232 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 69
🌻. స్నాన విధానము - స్నాపనోత్సవము - 2 🌻
మిగిలిన ఎనిమిది కుంభములలో పలాశ-అశ్వత్థ-వట-బిల్వ-ఉదుంబర-ప్లక్ష-జంబూ-శమీ-కపిత్థ వృక్షముల బెరుడునుండి తీసిన రసము పోయవలెను. అగ్నేయమునందున్న నవకమునందు మధ్య మధుపూర్ణ ఘటము నుంచవలెను. మిగిలిన ఎనిమిది కుంభములలో గోశృంగ-పర్వ-గంగాజల-గజశాలా-తీర్థ-క్షేత్ర(పొలము) ఖల (కల్ళము) ములమట్టి ఉంచవలెను. దక్షిణమున నున్న నవకమున మధ్యయందు తైలపూర్ణ ఘటము స్థాపింపవలెను. మిగిలిన ఘటములలో నారంగజంబీర-నింబ-ఖర్జూర-మృత్తికా-నారికేళ-పూగ-దాడిమ-పనసఫలము లుంచవలెను.
నైరృతిదిక్కున నవకమునందు మద్యక్షీర పూర్ణకుంభ ముంచి మిగిలిన ఎనిమిదిటిలో కుంకుమ-నాగపుష్ప-చంపక-మాలతీ-మల్లికా-పున్నాగ-కరవీర-కమలకుసుమములుంచవలెను. పశ్చిమ నవక మధ్యమున నారికేలజాలపూర్ణకలశ ముంచి, మిగిలిన ఎనిమిదింటిలో నదీ-సముద్ర-సరోవర-కూప-వర్షా-హిమ, నిర్ఘర-దేవనదుల జలము లుంచవలెను. వాయవ్య ననకమునందు మధ్య కదలీజలపూరితకుంభ ముంచి, మిగిలిన ఎనిమిది కుంభములందును సహదేవీ కుమారీ-సింహీ-వ్యాఘ్రీ-అమృతా-విష్ణుపర్ణీ-దుర్వా-వచా అను దివ్యౌషదుల నుంచవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 232 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 69
🌻 Mode of conducting the bathing festival (snāna) - 2 🌻
10. The remaining eight pitchers should be filled with the earth taken from loosening by cow’s horn, elephant’s tusk, horse hoofs, mountains, Ganges bed, sacred spots, rivers and fields.
11-12. In the nine pitchers on the south, the central one should be filled with sesamum. The other eight pitchers should be filled with nāraṅga, jambīra, kharjūra, nārikela (coconut), pūga (arecanut), pomegranate, panasa fruits. In the nine pitchers on the south-west, the central pitcher should be filled with milk.
13-15. (The remaining eight pitchers should be) duly (filled with) saffron (kuṅkuma), nāga, campaka, mālatī, jasmine, punnāga, karavīra, and mahotpala flowers. In the nine pitchers on the west, the central pitcher should contain the coconut water. (The other pitchers should contain) waters of the river, ocean, tank, well, rain water, water from the melted ice, waters of the falls, and of the Ganges. In the nine pitchers on the north-west the central one should have banana fruits.
16. The divine herbs sahadevī, kumārī, siṃhī, vyāghrī, amṛtā, viṣṇuparṇā, śataśivā and vacā should be placed in the other eight pitchers.
17-19. In the east and the northern (directions) among the nine pitchers one should place the central one having curd. The other pitchers should duly be filled with the fragrant substances—cardamom, tvacā, kuṣṭha, bālaka, the two varieties of sandal, the kastūrikā creeper and the black agallochum. (In the central pitcher among the nine pitchers on the north east) one should fill waters for purification. In the other pitchers we should have (the materials) candra, tāra, śukla, girisāra (iron), trapu (tin), camphor, śīrṣa and gems.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments