🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 235 / Agni Maha Purana - 235 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 71
🌻. గణపతి పూజావిధి కధనము 🌻
ఈశ్వరుడు పలికెను; విఘ్నవినాశమునకై గణపతిపూజను గూర్చి చెప్పెదను. ఇది సకలాభీష్టములను ఇచ్చును.
''గణంజయాయస్వాహా హృదయాయనమః; ఏకదంష్ట్రాయ హుం ఫట్ శిరసే నమః, అచల కర్ణినే నమో నమః శిఖాయై నమః, గజవక్త్రాయ నమో, నమః కవచాయ నమః, మహోదరాయ చణ్డాయ నమః నేత్రాభ్యాం నమః, సుదణ్డహస్తాయనమః అస్త్రాయనమః'' అని అంగన్యాసములు చేసికొనవలెను. ముఖ్యకమలమండలముపైదళములందు, క్రింది దళములందును గణ - గురు - గురుపాదుకా - శక్తి - అనంత - ధర్మములను, పూజించి కమలకర్ణికమీద బీజమును పూజింపవలెను. తీవ్రా, జ్వాలినీ, నందా! భోగదా, కామరూపిణీ, ఉగ్రా-తేజోవతీ, సత్యా, విఘ్ననాశినీ అను తొమ్మిది పీఠశక్తులను పూజించవలెను. పిమ్మట చందన చూర్ణను అసనముగ సమర్పించవలెను. 'యం' అనునది శోషకవాయుబీజము, 'రం'అగ్ని బీజము. 'లం' పృథివీబీజము, 'వం' అమృతబీజము,
'' ఓం లమ్బోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి, తన్నో దన్తిః ప్రచోదయాత్''
అనునది గణేశ గాయత్రీ మంత్రము, గణపతి-గణాధిప-గణేశ-గణనాయక-గణక్రీడ-వక్రతుండ-ఏకదంష్ట్ర-మహోదర-గజవక్త్ర - లంబోదర-వికట-విఘ్ననాశన-ధూమ్రవర్ణులను, మహేంద్ర దిక్పాలకులను గణపతి పూజంగముగ పూజించవలెను.
శ్రీ అగ్ని మహాపురాణమునందు గణపతి పూజావిధి కథన మను డెబ్బదియొకటవ అధ్యాము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 235 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 71
🌻 Mode of worshipping Gaṇeśa (gaṇeśapūjā) 🌻
The God said:
1-2. I shall describe the (mode of) worship of Gaṇa [i.e., gaṇapūjā, gaṇeśapūjā]. (Gaṇeśa) which removes obstacles and confers the desired. objects. (The worship of six kinds should be done as follows): The heart with “oblations to Gaṇeśa”, the head with “(obla-tions) to the one-tusked”, the tuft with “(oblations) to the one who has the ear like that of an elephant”, the armour with “(oblations) to the elephant-faced”, the eye with “(oblations) to the big-bellied,” the weapons with “(oblations) to one who has his own tusk in his hands”.
3-5. One should worship the gaṇa, the preceptor, the sandals, the (divine) energy, Ananta, the dharma, and the collection of bones in the lower part of the pedestal, the cover, the petals of the lotus, the lotus and the principal letter, (should be worshipped) in the upper part. (The energies) (are) Jvālinī, Nandā, Sūryeśā, Kāmarūpā, Udayā, Kāmavarttinī, Satyā, and Vighnanāśā. The seat (should be worshipped) with perfumes and earth. (With the following letters the appropriate acts should be performed): the drying with Yaṃ, the burning with raṃ, the agitating with laṃ and making it to nectar with vaṃ.
The gāyatrī-mantra is:
Om bodarāya vidmahe mahodarāya dhīmahi tanno dantī pracodayāt.
[“May we know the Supreme person. For that, we meditate upon Lambodara (long-bellied) and Mahodara (big-bellied). May Dantin (one who has the tusk) impel us towards it.”]
6-7. The following are the names of Gaṇeśa to be worshipped: “Gaṇapati (Lord of gaṇas), Gaṇādhipa (chieftain of the gaṇas), Gaṇeśa (Lord of gaṇas), Gaṇanāyaka (the lord of gaṇas), Gaṇakrīḍa (one who sports with the gaṇas), Vakratuṇḍa (having a bent trunk), Ekadaṃṣṭra (having one tusk), Mahodara (big-bellied), Gajavaktra (elephant-faced), Lambakukṣi (long-bellied), Vikaṭa (dreadful), Vighnanāśana (destroyer of impediments), Dhūnravarṇa (tawny-coloured) and Mahendra.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments