🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 243 / Agni Maha Purana - 243 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 73
🌻. సూర్య పూజా విధి వర్ణనము - 2 🌻
పిమ్మట ''ఓం బ్రహ్మవిష్ణుశివాత్మకాయ సౌరాయ యోగపీఠాత్మనే నమః'' అను మంత్రముచే సూర్యదేవుని పీఠమును పూజించవలెను. పిమ్మట ''ఖఖోల్కాయ నమః'' అను షడక్షర మంత్రమునకు ప్రారంభము 'ఓం హం ఖం' అను అక్షరములు చేర్చి తొమ్మిది అక్షరములు గల ''ఓం హం ఖం ఖఖోల్కాయ నమః'' అను మంత్రము ద్వారా సూర్య విగ్రహావామనము చేసి సూర్యుని పూజ చేయవలెను. దోసిటిలో నున్న ఉదకమును లలాటసమీపమునకు తీసికొనివెళ్ళి రక్త వర్ణుడైన సూర్యుని ధ్యానించి, ఆ సూర్యడు తన ఎదుట నున్నట్లు భావన చేయవలెను. పిదప ''హ్రాం హ్రీం సః సూర్యాయ నమః'' అని పలుకుచు సూర్యునకు అర్ఘ్య వీయవలెను.
పిదప బింబముద్ర చూపుచు ఆవాహనాద్యుపచారములు సమర్పింప వలెను. పిదప సూర్యుని ప్రీతికొరకై గంధాదికము సమర్పింపవలెను. ఆగ్నేయమునందు ''ఓం అం హృదయాయ నమః'' అను మంత్రముచే హృదయమును, నైరృతిదిక్కునందు ''ఓం భూః అర్కాయ శిరసే స్వాహా'' అను మంత్రముచే శిరస్సును, వాయవ్యమున ''ఓం భువః సురేశాయ శిఖాయై వషట్'' అను మంత్రముచే శిఖన, ఈశాన్యమునందు ''ఓం స్వః కవచాయ హుం'' అను మంత్రముచే కవచమును, ఇష్టదేవతకును ఉపాసకునకును మధ్య ''ఓం హాం నేత్ర త్రయాయ వౌషట్'' అను మంత్రముచే నేత్రమును, దేవతకు పశ్చిమభాగమునందు'' వః అస్త్రాయ ఫట్'' అను మంత్రముచే అస్త్రమును పూజింపవలెను. పిమ్మట పూర్వాదిదిశలందు ముద్రలను ప్రదర్శింపవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 243 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 73
🌻 Mode of worshipping the Sun - 2 🌻
9. One should invoke the god (with the mantra) hrāṃ hrīṃ sa and salutations to the sun-god [sūrya], showing the mudrā. One should offer him perfume etc. and show the bimbamudrā[1].
10. One should show the padmamudrā[2] and the bilvamudrā[3] (to the god) in all directions commencing with the southeast. Oṃ aṃ salutations to the heart. (Salutations) to sun on the head.
11. Bhūrbhuvaḥ svaḥ! Obeisance to the lord of celestials in the tuft of hair in the south-west, huṃ to the armour in the north-west, hāṃ to the eyes at the centre.
12. Va! (salutations) to the weapons in the east etc. Then one should show mudrās. Dhenumudrā (fingers folded in the shape of a cow) to the heart etc., The Goviṣāṇa mudrā[4] should be shown to the eyes.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Комментарии