top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 244 / Agni Maha Purana - 244


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 244 / Agni Maha Purana - 244 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 73


🌻. సూర్య పూజా విధి వర్ణనము - 3 🌻


హృదయ-శిరః-శిఖా-కవచములకు పూర్వాది దిక్కులందు ధేనుముద్రను ప్రదర్శించవలెను. నేత్రములకు గోశృంగముద్ర చూపవలెను. అస్త్రమునకు త్రాసనీముద్ర చూపవలెను. పిమ్మట గ్రహములకు నమస్కారము, పూజ చేయవలెను. ''ఓం సోం సోమాయ నమః'' అను మంత్రముతో తూర్పునందు చంద్రుని, ''ఓం బుం బుధాయ నమః'' అను మంత్రముతో దక్షిణమున బుధుని, ''ఓం బృం బృహస్పతయే నమః'' అను మంత్రముతో పశ్చిమమున బృహస్పతిని, ''ఓం భం భార్గవాయ నమః'' అను మంత్రముతో శుక్రుని పూజింపవలెను. ఈ విధముగ పూర్వాదిదిశలందు చంద్రాదిగ్రహములను పూజించి ఆగ్నేయాది విదిక్కులందు మిగిలిన గ్రహములను పూజింపవలెను ఎట్లనగా - ''భౌం భౌమాయ నమః'' అను మంత్రముతో ఆగ్నేయమున కుజుని, ''ఓం శం శనైశ్చరాయ నమః'' అను మంత్రముతో నైరృతి దిక్కునందు శ##నైశ్చరుని, ''ఓం రాం రాహవే నమః'' అను మంత్రముతో వాయవ్యమునందు రామువును, ''ఓం కేం కేతవే నమః'' అను మంత్రముతో ఈశాన్యమునందు కేతువును గంధాద్యుపచారములతో పూజింపవలెను.


ఖఖోల్కీ (సూర్యభగవానుని) తో పాటు ఈ అన్ని గ్రహములపూజ కూడ చేయవలెను. మూలమంత్రము జపించి, అర్ఘ్యపాత్రమునందు జలము గ్రహించి సూర్యునకు సమర్పించి, పిదప స్తుతించవలెను. ఈ విధముగ స్తుతి చేసిన పిదప అభిముఖముగ నిలబడి సూర్యునకు నమస్కరించి ఇట్లు ప్రార్థించవలెను. ''ప్రభో! నా అపరాధములను లోపములను క్షమింపుము''. పిమ్మట ''అస్త్రాయ ఫట్‌'' అను మంత్రముతో అను సంహార సమామరణము చేసి, ''శివసూర్య'' అని పలుకుచు సంహారిణీముద్ర ద్వారా సూర్యుని ఉపసంహృత మగు తేజస్సును తన హృదయకమలములో నుంచి సూర్యనిర్మాల్యమును ఆతని పార్షదుడైన చండునకు సమర్పింపవలెను. ఈ విధముగ జగదీశ్వరు డగు సూర్యుని పూజ చేసి, ధ్యానహోమములు చేయుటచే సాధకుని మనోరథములన్నియు సిద్ధించును.


అగ్ని మహాపురాణమునందు సూర్యపూజావిధివర్ణన మను డెబ్బదిమూడవ అధ్యాయము సమాప్తము.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 244 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 73


🌻 Mode of worshipping the Sun - 3 🌻


13-14. The trasanī (the dreadful) should be added to the mantra of the weapon and obeisance should be made to the planets (as follows)—soṃ salutations to the Moon, buṃ salutations to Mercury, bṛṃ to Jupiter, bhaṃ to Venus, aṃ to Mars, saṃ to Saturn, raṃ to Rāhu and keṃ to Ketu (to be done) in the petals (of the lotus) commencing with the east. The perfumes etc. (should be offered) with the khakholka mantra.


15. Having recited the principal mantra, water of oblation from the water-vessel should be offered to the sun-god. Then the worshipper should sing the glory of the lord, pay obeisance to him with his face turned away and say “Pardon me, (taking leave of thee)”.


16-17. One should mentally merge the five component principles in the fundamental one with the syllable phaṭ. The sun-god should be conceived as identical with lord Śiva in the lotus of the heart. One should offer light to the lord as a garland made of the solar rays. One gets everything by thus worshipping and contemplating the sun-god or by oblation unto fire in his honour.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹


Comentários


bottom of page