top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 245 / Agni Maha Purana - 245


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 245 / Agni Maha Purana - 245 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 74


🌻. శివ పూజా విధి వర్ణనము - 1 🌻


మహేశ్వరుడు చెప్పెను : స్కందా! ఇపుడు శివపూజా విధానమును చెప్పుచున్నాను. ఆచమనము చేసి ప్రణవ జపము చేయుచు సూర్యునకు అర్ఘ్య మీయవలెను. పిమ్మట పూజామండపద్వారమును 'ఫట్‌' అను మంత్ర ముచ్చరించుచు ఉదకముతో తడిపి, ప్రారంభమున 'హాం' బీజముతో నంది మొదలగు ద్వారపాలకులను పూజింపవలెను. ద్వారముపై ఉదుంబరవృక్షము స్థాపించి, లేదా భావన చేసి, దాని పై భాగముపై గణపతి - సరస్వతీ - లక్ష్మీ దేవులను పూజించవలెను. దక్షిణభాగమున నందిని, గంగను, వామభాగమున మహాకాలుని, యమునను పూజింపవలెను. పిమ్మట దివ్యదృష్టి ప్రసరింప చేసి దివ్యవిఘ్నములను తొలగించుకొనవలెను. వాటిని ఉద్దేశించి పుష్పములు విసరి, ''ఆకాశచారివిఘ్నము లన్నియు తొంగిపోయినవి.'' అని భావన చేయవలెను. కుడి మణవతో మూడు పర్యాయములు భూమిపై కొట్టి, ఇట్లు చేయుటచే భూతములపై నున్న సర్వవిఘ్నములు తొలగి నట్లు భావన చేయవలెను. పిమ్మట యజ్ఞమండపము యొక్క కడప దాటవలెను. ఎడమ కొమ్మ పట్టుకొని లోపల ప్రవేశించి, ఉదుంబరవృక్షమున అస్త్రన్యానము చేసి, మండపమధ్యమున పీఠాధారభూమిపై ''ఓం హాం వాస్త్వధిపతయే బ్రహ్మణే నమః'' అను మంత్రముతో వాస్తుదేవతాపూజ చేయవలెను.


నిరీక్షణాశస్త్రములచే శుద్ధము చేయబడిన గడ్డుకములను చేతిలో గ్రహించి, భావన ద్వారా శివాజ్ఞ గైకొని, సాధకుడు మౌనముగా గంగాది నదీతటమునకు వెళ్ళి, అచట తన శరీరమును పవిత్రము చేసికొని గాయత్రి మంత్రజపము చేయుచు వస్త్రముతో వడగట్టిన జలముతో జలాశయమునందు ఆ గడ్డుకములను నింపవలెను. లేదా హృదయబీజమును (మనః) ఉచ్చరించుచు నింపవలెను. పూజకై కావలసిన గంధ - అక్షత - పుష్పాది సకలద్రవ్యములను దగ్గర ఉంచుకొని, భూశుద్ధి మొదలగు కర్మలు చేయవలెను. ఉత్తరాభిముఖుడై, ఆరాధ్యదేవతకు కుడి ప్రక్క శరీరాంగములపై మాతృకాన్యాసము చేసి, సంహారముద్రతో అర్ఘ్యముకొరకై ఉదకము గ్రహించి మంత్రోచ్చారణపూర్వకముగ శిరస్సుకు తగల్చి, దానిని దేవతకు సమర్పించుటకై దగ్గర ఉంచుకొనవలెను. పిమ్మట భోగ్యము లగు కర్మల భోగమునకై కూర్మముద్రను ప్రదర్శించి ద్వాదశ దల హృదయకమలమున తన ఆత్మను ధ్యానించవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 245 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 74


🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 1 🌻


The Lord said:


I. I shall describe the (mode of) worshipping Śiva [i.e., śivapūjā]. After having sipped water, and repeated the syllable Oṃ, one should wash the entrance of the temple with water (consecrated by the) mantra of the weapon and worship the guardian deities of the door-ways and of the oblations etc.


2-3. One should worship goddess Sarasvatī (consort.of Lord Brahmā), Lakṣmī (consort of Lord Viṣṇu) and Gaṇa at the threshold, Nandin (attendant of Lord Śiva) and the Ganges on the right and Mahākāla (form of Śiva) and the Yamunā (river) on the left imagining himself as having divine sight, and after having driven the spirits and impediments present in the sky by throwing a consecrated flower.


4. One should kick the earth thrice with the right heels and enter the place of worship after leaping across the threshold holding the left door frame.


5. Having entered (the temple) by placing the right foot (first) and placing the weapons at the threshold, one should worship at its centre (repeating the following): Oṃ, hāṃ, (obeisance) to Brahmā, the presiding deity of the dwelling place.


6. Then he should go to the river Ganges silently carrying pure golden pitchers by means of searching instruments, after having obtained permission from Śiva.


7. One should fill them with waters of the river filtered with the cloth after the repetition of gāyatrī or the hṛdayamantra, and purifying one’s body.


8. The materials for worship such as the perfumes, unbroken rice and flowers etc. should be placed in front of the place and the purification of five material components (of the earth) should be done.


9. Having placed (these materials) on the right side of the deity with a pleasing face and having lifted these showing saṃhāra mudrā (posture of the fingers representing destruction), one should place them on the head with (the repetition of) the mantra.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page