🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 259 / Agni Maha Purana - 259 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 75
🌻. శివ పూజాంగ హోమ విధి - 4 🌻
"ఓ దేవతలారా! మీరందరును విఘ్నములను తొలగించి ఈ బాలకుని (అగ్నిని) సంరక్షించుడు" అను శివాజ్ఞను ఆ దేవతలకు వినిపించి, స్రుక్-స్రువములను ఊర్ధ్వముఖములుగ గ్రహించి వాటిని మూడేసి సార్లు అగ్నిపై వెచ్చచేయవలెను. కుశమూల-మధ్య-అగ్రభాగముతో వాటిని స్పృశించుచు ఆ స్థానములందు క్రమముగ ఆత్మతత్త్వ-విద్యాతత్త- శివతత్త్వముల న్యాసము చేయవలెను. "ఓం హాం ఆత్మతత్త్వయ నమః" "ఓం హీం విద్యాతత్త్వాయ నమః" "ఓం హుం శివతత్త్వాయ నమః" అమనని న్యాసమంత్రములు పిమ్మట 'శక్త్యైనమః' "శివాయ నమః" అను మంత్రముతో స్రుక్ స్రువములపై శివశక్తిన్యాసము చేయవలెను.
మూడు పేటల రక్షాసూత్రమును స్రుక్ స్రువముల కంఠభాగమునందు చుట్టబెట్టవలెను. పుష్పాదులతో వాటిని పూజించి కుడి ప్రక్కన ఉన్న కుశలముపై ఉంచవలెను. గోఘృతము గ్రహించి దర్శనాదులచే దానిని పరిశుద్ధము చేసి. తాను బ్రహ్మమయుడని భావన చేయుచు ఆ ఘృతపాత్రమును హృదయమంత్రముతో అగ్నికుండముపై అగ్నేయమున త్రప్పి. మరల నేను విష్ణుస్వరూపుడనని భావన చేయుచు, ఘృతమును ఈశాన్యమునం దుంచి, కుశాగ్రభాగముచే ఘృతము తీసి "శిరసే స్వాహా" "విష్ణువే స్వాహా" అను మంత్రములతో విష్ణువునకు ఆ ఘృతబిందువులను హోమము చేయవలెను. నేను రద్రమయుడ నని భావన చేయుచు, ఘృతమును కుండనాభిస్థామందుంచి, దాని అప్లావనము చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 259 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 75
🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 4 🌻
24-28. One should then make them hear this command of Śiva. He should then take the sacrificial spoon and the ladle, heat them on the fire and touch them with the base, middle and tips of the darbha with face downwards. In the place touched by the kuśa the three principles relating to the soul, knowledge and Śiva should be located duly with the sounds hāṃ, hrīṃ, hūṃ and saṃ. Having located the goddess in the sacrificial spoon and Śambhu (Śiva) in the sacrificial ladle with the hṛdaya mantra, their necks being girdled with three strings (of thread) and worshipped with flowers etc., kuśas should be placed on them and they should be placed on the right side.
29-32. Having gathered the clarified butter of the cow that has been purified by looking at it and after having contemplated one’s own Brahma form and carrying that clarified butter, one should wave it over the pit and move it round and round in the south-east. Again having contemplated the Viṣṇu form, one should hold the clarified butter and carry it towards the northeast, it should be offered to Viṣṇu (into the fire) with the tips of the kuśa and with the mantra of the head ending with svāhā. Similarly, one should conceive the form of Rudra (Śiva) as a point in one’s own navel and meditate. One should sprinkle water over that with two kuśas of the length of a span and held with the ring finger and thumb.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios