🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 260 / Agni Maha Purana - 260 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 75
🌻. శివ పూజాంగ హోమ విధి - 5 🌻
ప్రాదేశ (చాపిన బొటనవ్రేలు చివని నుంచి చూపుడు వ్రేలు చివరవరకుఉన్న పొడవు ప్రాదేశము) ప్రమాణము గల రెండు కుశలను అంగుష్ఠ-అనామికతాంగుళులతో పట్టుకొని, వాటితో, అస్త్రమంత్రో (ఫట్) చ్ఛారణము చేయుచు, నేతిని, అగ్నివైపు కదపవలెను. హృదయమంత్రము (నమః) ఉచ్చరించుచు, చేతిలోని దర్భను కాల్చి, దానిని 'ఫట్' తో అగ్నిచే పవిత్రము చేయవలెను. మండుతున్న కుశతో దానికి హారతి ఇచ్చి, మరొక కుశతో దానిని కాల్చవలెను. మండిన కుశమ అస్త్రమంత్రముతో అగ్నిలో పడవేయవలెను. పిమ్మట, ముడి వేసిన, ప్రాదేశప్రమాణము గల కుశను చేతిలో ఉంచవలెను. ఘృతములో రెండు పక్షములు, ఇడాది నాడీత్రయము ఉన్నట్లు భావన చేయవలెను. ఇడ మొదలగు ముడు భాగముల నుండి క్రమముగ స్రువముతో ఘృతము గ్రహించి హోమము చేయవలెను.
'స్వా' అని ఉచ్చరించి స్రువములోని ఆజ్యము అగ్నిలో వేయవలెను. 'హా' ఉచ్ఛరించుచు, హోమము చేయగా మిగిలిన ఘృతమును, వేరుగా ఉంచిన పాత్రలో ఉంచవలెను. ఇడాభాగము నుండి ఆజ్యము గ్రహించి "ఓం హాం అగ్నేయే స్వాహా" అను మంత్రము నుచ్చరించుచు హోమము చేసి, హుతశేషమును ఒక పాత్రలో ఉంచవలెను. పింగలా భాగము నుండి ఆజ్యము గ్రహించి "ఓం హాం సోమాయ స్వాహా" అని ఉచ్చరించుచు హోమము చేసి, హుతశేషమును ఒక పాత్రలో ఉంచవలెను. సుషువ్ణూనాడీ భాగము నుండి ఆజ్యము గ్రహించి "ఓం హాం అగ్నీ షోమాభ్యాం స్వాహా" అని ఉచ్చరించుచు స్రువముతో హోమము చేసి, హుతశేషమును ఒక పాత్రలో ఉంచుకొనవలెచు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 260 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 75
🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 5 🌻
33. Water should be sprinkled over the fire in front (of the worshipper) (with the two kuśas) held (as above) accompanied by the mantra of the weapon. Similarly, the worshipper should again sprinkle water (over the fire) in front of him with the hṛd (mantra).
34. The burnt ashes of darbha collected with the hṛd (mantra) should be purified by striking with the implements and with the other lighted darbha it should be taken out and lighted.
35-36. The darbha burnt by the mantra of the weapon should again be thrown into the fire. Having put the knotted darbha of the length of a span in the clarified butter, one should contemplate the two for nights, the three arteries iḍā etc. in the clarified butter and offer the clarified butter divided into three parts as oblation unto fire with the sacrificial ladle in order with (the syllable) sva and hā. The remaining part of the clarified butter should also be offered to the fire successively.
37. Oṃ hāṃ oblation to god Agni. Oṃ hāṃ oblation to god Soma. Oṃ hāṃ oblation to the gods Agni and Soma. (The above oblations should be offered into the fire) for the purpose of opening (as it were) the three eyes of the fire god in his face.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments