top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 261 / Agni Maha Purana - 261


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 261 / Agni Maha Purana - 261 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 75


🌻. శివ పూజాంగ హోమ విధి - 6 🌻


పిమ్మట బాలకుడైన అగ్ని యొక్క ముఖమునందున్న నేత్రత్రయస్థానమున మూడు నేత్రముల ఉద్ఘాటనము చేయుటకై, ఘృతపూర్ణ మగు స్రువముతో "ఓం హామగ్నయే స్విష్టకృతే స్వాహా" అను మంత్రమునుచ్చరించుచు నాల్గవ ఆహుతి ఇవ్వవలెను., "ఓం హాం హృదయాయ నమః" ఇత్యాద్యంగ మంత్రములు ఆరును ఉచ్చరించుచు ఆజ్యమును అభిమంత్రించి, ధేనుముద్రతో మేల్కొల్పవలెను. కవచమంత్రముచే (హుం) ఆచ్ఛాదించి, శరమంత్రముచే ఘృతబిందూత్‌క్షేపణము చేసి, అభ్యుక్షణశోధనములు చేయవలెను. శివస్యరూప డగు అగ్ని యొక్క ఐదు ముఖములకు అభిఘూరహోమము, అనుసంధానహోమము, ముఖముల ఏకీకరణమునకై చేయు హోమమును చేయవలెను.


"ఓం హాం సద్యోజాతాయ స్వాహా, ఓం హాం వామదేవాయ స్వాహా, ఓం హాం అఘోరాయ స్వాహా, ఓం హాం తత్పురుషాయ స్వాహా, ఓం హాం ఈశానాయ స్వాహా" అను ఐదు మంత్రములచే, ఐదు ముఖములకొరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అజ్యాహుతిచేసి, ఆ ముఖములను అభిఘారము చేసిన ఆజ్యముతో అప్లావితము చేయవలెను. ఇది ముఖాభి ఘార హోమము. పిమ్మట రెండేసి ముఖములకు ఒక ఆహుతి ఇవ్వవలెను. ఇది ముఖానుసంధానమహోమము. దానిని_"ఓం హాం సద్యోజాత వామదేవాభ్యాం స్వాహా, ఓం హాం వామదేవా ఘోరాభ్యాం స్వాహా, ఓం హాం అఘోరతత్పురుషాభ్యాం స్వాహా, ఓం హాం తత్పురుషేశానాభ్యాం స్వాహా" అను మంత్రములతో చేయవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 261 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 75


🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 6 🌻


38. The fourth oblation should be offered with the sacrificial ladle filled with clarified butter. Oṃ hāṃ oblation to firegod for the offering of a right sacrifice. After having consecrated in the six parts of one’s body, (the fire god) should be invoked with the dhenumudrā (posture with the fingers representing a cow).


39. Having covered it with the armour, the clarified butter should be protected by the mantra of the shaft. The clarified butter should be purified by sprinkling water and offering a drop of it into the fire along with the hṛd (mantra).


40. The rites of uniting the mouths of the fire should be performed as follows. Oṃ hāṃ oblations to Sadyojāta. Oṃ hāṃ oblations to Vāmadeva. Oṃ hāṃ oblations to Aghora. Oṃ haṃ oblations to Tatpuruṣa. Oṃ hāṃ oblations to Īśāna. Thus with oblations to one by one, one should do the union of the (different) faces.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹



Comentarios


bottom of page