🌹 . శ్రీ శివ మహా పురాణము - 683 / Sri Siva Maha Purana - 683 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴
🌻. త్రిపుర వర్ణనము - 3 🌻
వారు వేయి సంవత్సరములు శిరస్సుపై నిలబడి, వందసంవత్సరములు చేతులు పైకి ఎత్తియు తపస్సులు చేసిరి (22). చెడు పట్టుదల గల ఆ రాక్షసులు ఇట్లు పరమ దుఃఖముననుభవిస్తూ రాత్రింబగళ్లు నిద్రలేని వారై తపస్సును చేసిరి (23). ఓ మహర్షీ! ఇట్లు వారు గొప్ప తపస్సును చేయుచుండగా చాలాకాలము గడచినది. బ్రహ్మపై లగ్నమైన మనస్సు గల ఆ తారకపుత్రులు ధర్మముతో జీవిస్తూ తపస్సును చేసిరని నా అభిప్రాయము (24). అపుడు దేవతలకు మరియు రాక్షసులకు గురువు, గొప్ప కీర్తి గలవాడు, మహాత్ముడు అగు బ్రహ్మ వారి తపస్సుచే సంతసించి వరము నిచ్చుటకు ప్రత్యక్షమాయెను (25).
సర్వప్రాణులకు పితామహుడగు బ్రహ్మ మునులతో, దేవతలతో మరియు రాక్షసులతో గూడి అపుడు వారితో అనునయ పూర్వకముగా నిట్లనెను (26).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ గొప్ప రాక్షసులారా! మీ ఈ తపస్సుచే ప్రసన్నుడనైతిని. మీకు సర్వమును ఇచ్చెదను. మీకేది కావలయునో దానిని వరమడుగుడు (27). ఓ దేవ శత్రువులారా! మీరింత గొప్ప తపస్సును దేనికొరకు చేసితిరో చెప్పుడు. సర్వమును సృష్టించు నేనే అన్ని కాలములయందు సర్వుల తపస్సునకు ఫలము నిచ్చెదను (28).
సనత్కుమారుడిట్లు పలికెను - ఆయన మాటలను విని వారు ముగ్గురు ఆ పితామహునకు ప్రణమిల్లి చేతులు జోడించి మెల్లగా తమ మనస్సులోని మాటను వెల్లడించిరి (29). ఆ రాక్షసులిట్లు పలికిరి - ఓ దేవ దేవా! నీవు ప్రసన్నుడవై వరము నియదలచినచో, మేము ఏ ప్రాణిచేతనైననూ మరణము పొందకుండునట్లు మాకు వరము నిమ్ము (30). ఓ జగత్ప్రభూ! మమ్ములను శాశ్వతముగా నుండునట్లు చేయుము. ముసలితనము, రోగము మొదలగు ఆటంకములు మమ్ములను దరి చేరకుండు గాక! మమ్ములను ఏ కాలము నందైననూ మృత్యువు సమీపించరాదు (31). మేము ముగ్గురము జరామరణములు లేని వారము కావలెను. ఇది మా కోరిక. ముల్లోకములలో ఇతరులనందరినీ మృత్యువును పొందునట్లు మేము చేసెదము (32). విశాలమగు సంపదతో గాని, గొప్ప నగరములతో గాని, ఇతరములగు మహాభోగములతో గాని, స్థిరమగు ఐశ్వర్యముతో గాని ప్రయోజనమేమి గలదు? (33) సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 SRI SIVA MAHA PURANA - 683🌹 ✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj 🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 01 🌴 🌻 Description of Tripura (the three cities) - 3 🌻 22. They remained standing on their heads for a thousand years. They remained standing with their arms lifted for hundred years. 23. Thus they bore extreme distress in their tenacious evil intent. They remained alert day and night. 24. O sage, thus many years elapsed even as they performed the penance. I think they had a virtuous dedication of their souls in Brahmā, these sons of Tāraka. 25. Satisfied by their penance, Brahmā the supreme lord of the gods and Asuras, of great glory, appeared in front of them in order to grant them boons. 26. He was accompanied by sages, gods and Asuras. The grandfather of all living beings spoke to them thus, appeasing them. Brahmā said:— 27. O great Asuras, I am now pleased with your penance. I shall grant you everything. Speak out the boons you wish to have. 28. O enemies of the gods, tell me why you have been performing this penance. I am the bestower of the fruits of all sorts of penance. I am the creator of everything for ever. Sanatkumāra said:— 29. On hearing his words they bowed to the grandfather, with their palms joined in reverence and spoke to him revealing their mind’s desire slowly. The Asuras said:— 30. O lord of gods, if you are pleased, if boons are to be given to us, please grant us indestructibility at the hands of everyone, every living being. 31. O lord of the universe, make us steady. Protect us from enemies. Let not old age, sickness and death befall us at any time. 32. We wish to become free from old age and death. In the three worlds we shall subject all others to death. 33. Of what avail are riches, vast earth, excellent cities, other sorts of vast enjoyments or big positions and power? Continues.... 🌹🌹🌹🌹🌹
Comments