top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 686 / Sri Siva Maha Purana - 686


🌹 . శ్రీ శివ మహా పురాణము - 686 / Sri Siva Maha Purana - 686 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴


🌻. త్రిపుర వర్ణనము - 6 🌻


అపుడు ధీరుడగు మయుడు తపః ప్రభావముచే తారకాక్షునకు బంగారముతో, కమాలాక్షునకు వెండితో (57), విద్యున్మాలికి ఇనుముతో మూడు రకముల ఉత్తమ దుర్గములను నిర్మించెను . అవి క్రమముగా స్వర్గమునందు,ఆకాశమునందు, మరియు భూమిపై ఉండెడివి (58). మయుడు వారి హితమునందు లగ్నమైన మనస్సు గలవాడై ఆ రాక్షసులకు మూడు నగరములను ఇచ్చి వాటియందు తాను స్వయముగా ప్రవేశించెను (59). మహా బలపరాక్రమవంతులగు తారకుని పుత్రులు ఈ మూడు నగరములను పొంది వాటి యందు ప్రవేశించి సమస్త భోగముల ననుభవించిరి (60).


ఆ నగరములయందు కల్పవృక్షములు దట్టముగా నుండెను. ఏనుగులతో, గుర్రములతో అవి హడావుడిగా నుండెను. అనేక ప్రసాదములతోనిండి యుండెను. మణితోరణములతో అలంకరింపబడెను (61). సూర్యకాంతులను విరజిల్లే ప్రాసాదములు అన్నివైపులా సింహద్వారములను కలిగి యుండెను. పద్మరాగమణులు పొదిగి చంద్రుని వలె తెల్లనైన కాంతులు గల ప్రాసాదములతో (62), కైలాసశిఖరమును బోలిన దివ్యమగు గోపురములతో ఆ నగరములు ప్రకాశించెను. వాటియందు దేవతా స్త్రీలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు కోలాహలముగా నుండిరి (63). ప్రతి గృహమునందు రుద్రలయము, అగ్ని హోత్రము ప్రతిష్ఠింపబడి యుండెను. శివభక్తి నిష్ఠులు, శాస్త్రపండితులు అగు బ్రహ్మణశ్రేష్ఠులు ఆ నగరములలో నుండిరి (64).


ఆ మూడు నగరములు బావులతో, దిగుడు బావులతో, చెరువులతో ప్రకాశించినవి. వాటిలోని ఉద్యానవనములు ఉత్తమగుణములు కలిగి స్వర్గమునుండి జారినవా యన్నట్లు ఉన్న వృక్షములతో కూడియుండెను (65). ఆ నగరములు నదులతో, నదములతో మరియు విశాలమగు సరస్సులతో ప్రకాశించెను. అన్ని రకములు ఫలములతో నిండిన అనేక వృక్షములతో అవి సుందరముగా నుండెను (66). మదించిన ఏనుగుల గుంపులతో, అందమగు గుర్రములతో, వివిధ ఆకారములు గల రథములతో మరియు పల్లకీలతో ఆ నగరము భాసిల్లెను (67). ఆ మూడు నగరములు వేర్వేరు స్థలములలో నిర్మింపబడిన సమయమును నిర్దేశించే యంత్రములతో, క్రీడాంగణములతో, మరియు వేదాధ్యయన పాఠశాలలతో ప్రకాశించినవి (68).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 686🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 01 🌴


🌻 Description of Tripura (the three cities) - 6 🌻


57-58. Then the intelligent Maya built the cities by means of his penance: the golden one for Tārakākṣa, the silver one for Kamalākṣa and the steel one for Vidyunmālī. The three fortlike excellent cities were in order in heaven, sky and on the earth.


59. After building the three cities (tripura) for the Asuras, Maya established them there desiring their welfare.


60. Entering the three cities (tripura) thus, the sons of Tāraka, of great strength and valour experienced all enjoyments.


61. They had many Kalpa trees[5] there. Elephants and horses were in plenty. There were many palaces set with gems.


62. Aerial chariots shining like the solar sphere, set with Padmarāga stones, moving in all directions looking like moonshine illuminated the cities.


63-64. There were many palaces, divine minarets resembling the summits of the mount Kailāsa. Celestial damsels, Gandharvas, Siddhas, and Cāraṇas were also there. There were temples of Rudra. In every house, people performed the rites of Agnihotra. There were excellent brahmins well-versed in sacred texts and devoted to Śiva always.


65-66. The cities were embellished with many trees in the well-laid out gardens and parks as if they had dropped from heaven. There were beautiful tanks, lakes, wells, rivers and huge ponds. They were very beautiful with plenty of fruit-bearing trees.


67. The cities were decorated with camps and tents of various sizes and chariots with beautiful horses. There were herds of elephants in rut too.


68. There were time-indicators, playgrounds and different halls for Vedic studies.



Continues....


🌹🌹🌹🌹🌹


2 views0 comments

Comments


bottom of page