top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 687 / Sri Siva Maha Purana - 687


🌹 . శ్రీ శివ మహా పురాణము - 687 / Sri Siva Maha Purana - 687 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴


🌻. త్రిపుర వర్ణనము - 7 🌻


వాక్కులతో వర్ణింప శక్యము కానివి, మనస్సుతో ఊహింప శక్యము గానివి అగు ఆ నగరములు పాపాత్ములకెన్నడూ కానరావు. శుభమగు ప్రవర్తన కల్గి పుణ్యవంతులగు మహాత్ములు మాత్రమే వాటిని చూడగల్గుదురు (69). పతిని సేవించు స్వభావము గలవారు, అధర్మమునందు రుచిలేని వారు అగు పతివ్రతాస్త్రీలు ఆ నగర ప్రదేశములను పావనము చేయుచుండిరి (70). మహాత్ములు, వీరులు అగు రాక్షసులు, మరియు శ్రౌతస్మార్తముల తత్త్వము నెరింగి స్వధర్మనిష్ఠులగు బ్రహ్మణులు తమ భార్యాబిడ్డలతో ఆ నగరముల యందు నివసించిరి (71). విశాలమగు వక్షస్ధ్సలము గలవారు, బలిసిన భుజములు గలవారు, సంధికి యుద్ధమునకు కూడ సదా సంసిద్ధులై యుండు వారు, ప్రసన్నమైన వారు, కోపస్వభావము గలవారు, గూనివారు, పొట్టివారు కూడ ఆ నగరములలో నుండిరి (72).


మయునిచే రక్షింపబడి శిక్షణ నీయబడి యుద్ధమునకు తహతహలాడు వారు, నల్లకలువలవలె నల్లగా ప్రకాశించే ఉంగరములు తిరిగిన జుట్టు గలవారు నగు రాక్షసులు ఆ నగరములలో నివసించిరి (73). గొప్ప యుద్ధముల యందభిరుచి గలవారు, అజుడగు శివుని పూజించుటచే పరిశుద్ధమైన పరాక్రమము గలవారు, సూర్యుడు, వాయువు మరియు మహేంద్రునితో సమానమైన వారు, దేవతలను మర్దించే దృడకాయులు అగు దైత్యులు ఆ నగరములలో అంతటా నివసించి యుండిరి (74). వేదశాస్త్ర పురాణములలో ఏయే ధర్మములు కీర్తింపబడినవో, శివునకు ప్రియమగు అట్టి ధర్మములు అచట సర్వత్రా సర్వకాలములలో విలసిల్లినవి (75).


తారకుని పుత్రులగు ఆ రాక్షసులు ఇట్టి నగరములను వరముగా పొంది శివభక్తుడగు మయుని సేవిస్తూ ఆ నగరములలో నివసించిరి(76). వారు సర్వదా శివభక్తి పరాయణులైననూ ముల్లోకములను పీడించి ఆ నగరములను ప్రవేశించి గొప్పగా రాజ్యమును పాలించిరి (77). ఓ మహర్షీ! పుణ్యాత్ములగు ఆ రాక్షసులు చక్కగా రాజ్యమును పాలిస్తూ ప్రీతితో ఆ నగరములలో నివసించు చుండగా చాల కాలము గడిచెను (78).


శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందు యుద్ధ ఖండలో త్రిపురవర్ణనమనే మొదటి అధ్యాయము ముగిసినది (1).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 687🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 01 🌴


🌻 Description of Tripura (the three cities) - 7 🌻


69. There were persons of various types—sinners, virtuous, pious, noble and those of good conduct too.


70. The place was sanctified everywhere by chaste ladies engaged in serving their husbands and averse to evil practices.


71. The cities contained heroic Asuras of great fortune accompanied by their wives, sons and brahmins well versed in the principles and practices of the Vedic and Smārta rites. They were strict adherents to their duties.


72. People had broad chests and bull-like shoulders. Some were of peaceful nature and some of warlike temperament. Some were calm and some furious. Some were hunchbacked, Some were dwarfish.


73. They were protected by Maya. Some had the blue-lily petals. Their hair was curly and dark in hue. Maya had instructed them in the arts of warfare.


74. The cities abounded in people engaged in terrific battles. There were many Asuras whose heroism was sanctified by the worship of Brahmā and Śiva. The Asuras resembled the sun, the Maruts and Mahendra. They were sturdy.


75. Whatever sacred rites are mentioned in Śāstras, Vedas and Purāṇas, as favourites of Śiva, as also the deities, favourites of Śiva, were found there.


76. Thus the Asuras, sons of Tāraka, after acquiring the boons, lived there subservient to Maya, a great devotee of Śiva.


77. Abandoning the other parts in the three worlds they entered the cities and ruled the kingdom following the principles of Śiva.


78. O sage, a long time elapsed even as they were engaged in meritorious activities and living happily ruling over the good kingdom.



Continues....


🌹🌹🌹🌹🌹

0 views0 comments

コメント


bottom of page