🌹 . శ్రీ శివ మహా పురాణము - 691 / Sri Siva Maha Purana - 691 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴
🌻. శివ స్తుతి - 4 🌻
వేదము నీ స్వరూపమే. నీ ముఖమే వేదము. సదాచారమనే మార్గమునందు పయనించు నీవు సదాచారమనే మార్గమునందు నడచువారిచే పొందబడెదవు. నీకు అనేక నమస్కారములు (29). వ్యాపకమైన కీర్తి గలవాడు, సత్యస్వరూపుడు, సత్యము, ప్రియమైనవాడు, సత్యవర్తనముచే పొందగినవాడు అగు నీకు నమస్కారము (30). మాయావి, మాయను వశము చేసుకున్నవాడు అగు నీకు అనేక నమస్కారములు. బ్రహ్మనుండి పుట్టినవాడు, పరబ్రహ్మస్వరూపుడు, బ్రహ్మజ్ఞానులు తన స్వరూపమైనవాడు అగు నీకు నమస్కారము (31). ఓ ఈశ్వరా! తపస్స్వరూపుడవగు నీవు తపస్సును చేయువారికి ఫలమునిచ్చెదవు. స్తుతిస్వరూపుడవగు నీవు నిత్యము భక్తులచే స్తుతింపబడెదవు. నీ మనస్సు భక్తుల స్తుతిచే మిక్కిలి ఆనందించును (32).
వేదోక్త కర్మానుష్ఠానముచే ప్రసన్నుడవగు వాడు, స్మృతి విహిత ధర్మమునందు ప్రీతిగలవాడు, జరాయుజ, ఉద్భిజ, ఆండజ, స్వేదజములను ప్రాణులే స్వరూపమైనవాడు, జలములో మరియు భూమిపై నివసించే ప్రాణులే స్వరూపముగా గలవాడు అగు నీకు నమస్కారము (33). ఓ దేవా! దేవతలు మొదలగు వారందరిలో శ్రేష్ఠులు నీ విభూతులే. దేవతలలో ఇంద్రుడు నీవే. గ్రహములలో సూర్యుడు నీవే (34). లోకములలో సత్యలోకము నీవే. నదులలో మందాకిని నీవే. వర్ణములలో శ్వేత వర్ణమునీవే. సరస్సులలో మానస సరోవరము నీవే (35). పర్వతములలో హిమవంతుడవు నీవే. గోవులలో కామధేనువు నీవే. సముద్రములలో పాలసముద్రము నీవే. లోహములలో బంగారము నీవే (36).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 691🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 02 🌴
🌻 The Prayer of the gods - 4 🌻
29. Obeisance to Thee whose form is the Veda, obeisance to the reciter of the Vedas. Obeisance to Thee who traversest the path of good conduct and who art approachable through the path of good conduct.
30. Obeisance to Thee the glory-seated; to the Truth-ful, beloved of truth, to the truth. Obeisance to Thee know-able through the truth. was a wrestler in Kaṃsa’s service. He was slain by Kṛṣṇa.
31. Obeisance to Thee possessed of magic-power, obeisance to the lord of magic; Obeisance to Thee (knowable through the Vedas), to Brahman, to the one born of Brahmā.
32. Obeisance to Thee, O lord, the penance, the bestower of the fruits of penance, obeisance to thee, worthy of eulogy, the eulogy, and to Thee whose mind is pleased with eulogy always.
33. Obeisance to Thee delighted with vedic conduct, to the one fond of praiseworthy conduct; to the one who has fourfold forms and the forms of aquatic and terrestrial beings.
34. O lord, the gods and all others, being excellent, are your excellences. Among the gods you are Indra; among the planets you are the sun.
35. Among the worlds you are Satyaloka. Among the rivers you are the celestial river Gaṅgā. Among the colours you are the white colour. Among the lakes you are the Mānasa lake.
36. Among the mountains you are the Himālaya mountain. Among the cows you are the Kāmadhenu1, Among the oceans you are the milk ocean. Among the metals you are gold.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments