🌹 . శ్రీ శివ మహా పురాణము - 693 / Sri Siva Maha Purana - 693 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴
🌻. శివ స్తుతి - 6 🌻
ఋతువులన్నింటిలో వసంత ఋతువు నీవే పర్వదినము లన్నింటిలో సంక్రమణము నీవే. గడ్డి జాతులన్నింటిలో దర్భ నీవే. పెద్ద వృక్షములలో మర్రి నీవే (47). యోగములలో వ్యతీపాత యోగము నీవే. లతలలో సోమలతవు నీవే. బుద్ధులలో ధర్మబుద్ధివి నీవే. మిత్రులలో భార్యవు నీవే (48). ఓ మహేశ్వరా! సత్పురుషులగు సాధకులలోని ప్రాణాయామము నీవే. జ్యోతిర్లింగము లన్నింటిలో నీవు విశ్వేశ్వరుడవని ఋషులు చెప్పెదరు (49). బంధువులందరిలో ధర్మమనే బంధువు నీవే. ఆశ్రములలో సన్న్యాసాశ్రమము నీవే. పురుషార్థములన్నింటిలో మోక్షము నీవే. రుద్రులలో నీలకంఠుడు, రక్తవర్ణుడు అగు రుద్రుడు నీవే (50).
ఆదిత్యులలో విష్ణువు నీవే. వానరులలో హనుమంతుడవు నీవే. యజ్ఞములలో జపయజ్ఞము నీవే. శస్త్రధారులలో శ్రీరాముడవు నీవే (51). గంధర్వులలో చిత్రరథుడు నీవే. వసువులలో నిశ్చయముగా అగ్నిని నీవే. మాసములలో అధికమాసము నీవే. వ్రతములలో చతుర్దశీ వ్రతము నీవే (52). గొప్ప ఏనుగులలో ఐరావతము నీవే. సిద్ధులలో కపిలుడవు నీవేనని పెద్దలు చెప్పెదరు. సర్పములలో శేషుడవు నీవే. పితృదేవతలలో ఆర్యముడవు నీవే (53). గణకులలో కాలము నీవే. దైత్యులలో బలినీవే. ఇన్ని మాటలేల? ఓ దేవదేవా! నీవే ఒకే అంశముతో జగత్తునంతనూ వ్యాపించి యున్నావు. వస్తువునకు బయట నీవు ఉన్నావు. వస్తువునందు సారరూపుడవై నీవే ఉన్నావు (54, 55).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 693🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 02 🌴
🌻 The Prayer of the gods - 6 🌻
47. Among the seasons you are the spring; among holy occasions you are the Saṃkrama; among grasses you are the Kuśa grass; among gross trees you are the Banyan tree.
48. Among the Yogas you are the Vyatīpāta; among creepers you are the Soma creeper; among intellectual activities you are the virtuous inclination, among intimate ones you are the wife.
49. Among the pure activities of the aspirant, O great lord, you are Prāṇāyāma; among all Jyotirliṅgas you are Viśveśvara.
50. Among all kindred beings you are Dharma. In all stages of life you are Sannyāsa. You are the supreme Liberation in all Vargas. Among Rudras you are Nīlalohita.
51. Among all Ādityas you are Vāsudeva; among the monkeys you are Hanumat; among the sacrifices you are Japayajña; among the weapon-bearers you are Rāma:
52. Among the Gandharvas you are Citraratha; among the Vasus you are certainly the fire; among the months you are the intercalary month; among the holy rites you are the Caturdaśī rite.
53. Among all lordly elephants you are Airāvata3; among all Siddhas you are Kapila; among all serpents you are Ananta, among all Pitṛs you are Aryaman.
54-55. You are Kāla (Time) among those who calculate; among Asuras you are Bali. O lord of gods, of what avail is a detailed narration? You preside over the entire universe and remain partially stationed within and partially without.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments