top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 695 / Sri Siva Maha Purana - 695


🌹 . శ్రీ శివ మహా పురాణము - 695 / Sri Siva Maha Purana - 695 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 03 🌴


🌻. త్రిపుర వధోపాయం - 1 🌻


"ఓ దేవతలారా! త్రిపురాధ్యక్షుడైన మయుడు ఇప్పుడు అధిక పుణ్యవంతుడై ఉన్నాడు. త్రిపురాసురులు, మయుడు, వారి నగరాలలోని స్త్రీ, పురుషులు వేద ధర్మాన్ని వీసమెత్తు తప్పకుండ పాటిస్తున్నారు. విశేషించి వారందరు విభూతి ధారణ, లింగ పూజ నిరంతరము చేసే శివభక్తులు, పంచాక్షరీ మంత్ర పరాయణులు. మీ కష్టాలు నాకు తెలిసినా మిత్ర ద్రోహం చెయ్యలేను కదా. బ్రహ్మ హత్య, సురాపానం, చౌర్యం మరియు వ్రత భంగం వీటికి మహర్షులు ప్రాయశ్చిత్తాన్ని చెప్పారు. కాని మిత్ర ద్రోహానికి, కృతఘ్నతకు నిష్కృతి లేదు.


భక్తపాలన వ్రతంగా గల నేను నా భక్తులకు ద్రోహాన్ని ఎలా తలపెట్ట గలను? మిత్ర ద్రోహాన్ని మించిన పాపం లేదు. ఐనా ఈ విషయాన్ని మీరు నారాయణునికి నివేదించండి." శంభుని ధర్మ బద్ధమైన వాక్కులకు ఎదురాడలేక గీర్వాణులు కమలాసనుని వద్దకేగి విషయాన్ని విన్నవించి ఆయనతో కలిసి హరి సన్నిధికేగి తమ గోడును చెప్పుకొన్నారు.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 695🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 03 🌴


🌻 Tripura Vadopayam - 1 🌻


'O Gods! Mayu, the Tripuradhyaksha, is now highly virtuous. Tripurasuras, Mayudu, men and women in their cities follow the Vedic Dharma without fail. Especially all of them are devotees of Shiva who do Vibhuti Dharana, Linga Puja continuously and Panchakshari Mantra parayans. Even if I know your troubles, I can't betray a friend.


Sages offered atonement for Brahma killing, Surapanam, Chauryam and Vrata Bhangam. But there is no excuse for treachery and ingratitude. How can I, who is on a vow of devotion, betray my devotees? There is no greater sin than betraying a friend. But report this matter to Narayana.' Unable to resist the pious words of Sambhu, the Girvans approached Kamalasana and together with him, in the presence of Hari, said their vow.



Continues....


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Comments


bottom of page