top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 698 / Sri Siva Maha Purana - 698


🌹 . శ్రీ శివ మహా పురాణము - 698 / Sri Siva Maha Purana - 698 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 04 🌴


🌻. త్రిపుర వాసుల దీక్షాస్వీకారము - 2 🌻


ఓ మాయావీ! పదునారు వేల శ్లోకములు గలది, వేదములకు స్మృతులకు విరుద్ధమైనది, వర్ణాశ్రమ విభాగము లేనిది అగు మోసముతో నిండిన శాస్త్రమును రచింపుము (10).


మానవులను భ్రష్టులను చేయునట్టియు, పౌరుషమునకు మాత్రమే ప్రాధాన్యము నిచ్చు శాస్త్రమును ప్రయత్నపూర్వకముగా రచింపుము. అది విస్తారమును పొందగలదు (11). అట్టి శాస్త్రమును నిర్మించు సామర్థ్యమును నీకు నేను ఇచ్చెదను. నీకు అట్టి సామర్థ్యము కలుగ గలదు. అనేక రకముల మాయ శీఘ్రమే నీకు వశము కాగలదు (12). పాపహారి, పరమాత్మ, దుష్ట శిక్షకుడునగు విష్ణువు యొక్క ఆ మాటను విని ఆ మాయావి నమస్కరించి ఇట్లు బదులిడెను (13).



యతి ఇట్లు పలికెను-


ఓ దేవా! నా కర్తవ్యమేమి? ప్రభూ! నాకు కర్త్వయమును వెంటనే ఆదేశించుము. నీ ఆజ్ఞచే సర్వకర్మలు సఫలము కాగలవు (14).



సనత్కుమారుడిట్లు పలికెను-


ఇట్లు పలికిన తరువాత విష్ణువు ఆతనిచే మాయా ప్రధానమగు శాస్త్రమును పఠింపజేసెను. స్వర్గనరకములు ఇచటనే గలవు. మరణానంతరగతి ఏదీ లేదు. ఇది ఆ శాస్త్రసారము (15). విష్ణువు శివుని పాదపద్మములను స్మరించి మరల ఆతనితో నిట్లనెను: ఈ త్రిపురాసురులను, త్రిపురవాసులను అందరినీ నీవు మోహింపజేయవలెను (16). వారికి నీవు దీక్షలనీయవలెను. వారిచే ఈ శాస్త్రమును ప్రయత్నపూర్వకముగా పఠింపజేయవలెను. ఓ మహాబుద్ధీ! నా ఆజ్ఞచే ప్రవర్తిల్లు నీకు దోషము అంటుకొనదు (17). ఆ త్రిపురములలో శ్రౌతస్మార్త ధర్మములు విలసిల్లుచున్నవనుటలో సందేహము లేదు. ఓ యతీ! నీవు ఈ విద్యతో వాటినన్నిటినీ నిశ్చయముగా నాశనము చేయవలెను (18).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 698🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 04 🌴


🌻 The Tripuras are initiated - 2 🌻


10-11. O you who wield Māyā, ceate a deceptive sacred text of sixteen hundred thousand verses,[2] contrary to Śrutis and Smṛtis wherein Varṇas and Āśramas shall be eschewed. Let that holy text be in Apabhraṃśa lauguage. Let there be emphasis on actions. You shall strain yourself to extend it further.


12. I shall bestow on you the ability to create it. Different kinds of magic arts shall be subservient to you.”


13. On hearing the words of Viṣṇu, the great soul, the Māyā Puruṣa bowed to and replied to Viṣṇu.



The shaven-head said:—


14. O lord, command me quickly what I shall do. At your bidding, all activities shall be fruitful.



Sanatkumāra said:—


15. Saying this he recited the main tenet in the deceptive philosophy. “Heaven and hell are functioning here itself.”


16. Remembering the lotus-like feet of Śiva, Viṣṇu told him again. “These Asuras, the residents of the three cities, shall be deluded.


17. O intellegent one, they shall be initiated by you. They shall be taught strenuously. At my bidding you will incur no sin on that account.


18. O ascetic, no doubt, Vedic and Smārta rites flourish and shine there. But these shall certainly be exploded through this Vidyā.



Continues....


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Commenti


bottom of page