🌹 . శ్రీ శివ మహా పురాణము - 707 / Sri Siva Maha Purana - 707 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 05 🌴
🌻. త్రిపుర మోహనము - 5 🌻
రహ్మ యొక్క స్వరూపము ఆనందమని వేదము చెప్పుచున్నది. కాని ఆ ఆనందము ఈ లోకములో మాత్రమే పొందదగినది అని తెలియదగును. ఈ లోకములోని నానాత్వము మిథ్య, కల్పితము (36). ఈ దేహము ఆరోగ్యముగా నున్నంతవరకు, ఇంద్రియములు నీరసములు కానంతవరకు మరియు ముసలిదనము మీద బడనంతవరకు సుఖములననుభవించవలెను (37). దేహములో ఆరోగ్యములేని, ఇంద్రియములలో శక్తిలేని ముసలి దనములో సుఖమెక్కడది? కావున సుఖమును గోరు మానవులు యాచకులకు తమ దేహమునైననూ దానము చేయవలెను (38). యాచకుల మనస్సులకు ఆనందమును కలిగించని మానవుడు పుట్టుట వలన భూమికి భారము పెరుగుచున్నది. సముద్రములు, పర్వతములు, వృక్షములు భూమికి భారము కావు (39).
దేహము కొద్దికాలములో పడిపోవును. సంపాదించిన ధనము శాశ్వతము కాదు. బుద్ధి మంతుడు ఈ సత్యము నెరింగి దేహసౌఖ్యమును సంపాదించు కొనవలెను (40). కుక్కలు, కాకులు, క్రిములు ఈ శరీరమును చల్ది అన్నముగా చేసుకొని భుజించును. ఈ శరీరము అంతములో బూడిదయగునని వేదవాక్కు సత్యము(41). మానవులలో వీరు వ్యర్థముగా జాతి భేదమును కల్పించుచున్నారు. అందరిలో మానవత్వము సమానమై యుండగా, అధముడెవరు?ఉత్తముడెవరు? (42) ఈ సృష్టిని బ్రహ్మ రచించినాడని వృద్ధులు చెప్పెదరు. మరియు, ఆ బ్రహ్మ గారికి దక్షుడు, మరీచి అను ఇద్దరు కుమారులు గలరని పురాణ ప్రసిద్ధి గలదు (43).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 707🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 05 🌴
🌻 The Tripuras are fascinated - 5 🌻
36. It is said in the Vedas that Bliss is an aspect of the Brahman. That shall be taken as it is. It is false to bring in various alternatives.
37. One shall seek and enjoy happiness as long as the body is hale and hearty, as long as the sense-organs are not impaired and as long as the old age is far off.
38. When there is sickness, impairment of the sense-organs and old age how can one derive happiness? Hence those who seek happiness shall be prepared to give away even the body.
39. The Earth is burdened by those who are not ready to please and satisfy the suppliant. It is not burdened by oceans, mountains and trees.
40. The body is ready to go in a trice, and hoarded things are attended with the risk of dwindling down. Realising this a sensible man shall see to the pleasure of his body.
41. It is mentioned in the Vedas that this body is going to constitute the breakfast for dogs, crows and worms. The body has its ultimate end in being reduced to ashes.
42. It is unnecessary to divide the people into different castes. When all are men who is superior and who is inferior?
43. Old men say that creation began with Brahmā. He begot two sons the famous Dakṣa and Marīci.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments