top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 710 / Sri Siva Maha Purana - 710


🌹 . శ్రీ శివ మహా పురాణము - 710 / Sri Siva Maha Purana - 710 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 06 🌴


🌻. శివస్తుతి - 1 🌻


వ్యాసుడిట్లు పలికెను -


ఓ సనత్కుమార ప్రభూ! రాక్షసరాజు, ఆతని సోదరులు, మరియు పౌరులు ఇట్లు మోహములో పడగా, ఓ సనత్కుమారా, ఏం జరిగింది? దయచేసి ప్రతిదీ పేర్కొనండి.


సనత్కుమారుడిట్లు పలికెను.


త్రిపురములు అట్లు భ్రష్టమైనవి. త్రుపురాసురులు శివార్చనను విడినాడిరి. స్త్రీ ధర్మ మంతయు నాశనమయ్యెను. దురాచారము స్థిరపడెను (2).లక్ష్మి పతియగు విష్ణువు ఇట్లు కృతార్థుడై ఆ వృత్తాంతమును శివునకు వివేదించుటకు దేవతలతో గూడి కైలాసమునకు వేళ్లెను (3). లక్ష్మీపతియగు విష్ణువు దేవతలతో గూడి కైలాసమునకు సమీపములో నుండి పరమ సమాధిలోనికి వెళ్లెను. బ్రహ్మ కూడ అటులనే చేసెను (4). అపుడు పురుషోత్తముడగు విష్ణువు, మరియు బ్రహ్మ సమాధిలో మనస్సుతో సర్వజ్ఞుడగు శంకరుని దర్శించి అభీష్టములగు వచనములతో స్తుతించిరి (5).


విష్ణువు ఇట్లు పలికెను.


పరమాత్మ, బ్రహ్మ విష్ణు రుద్రులను రూపములను దాల్చినవాడు, మహేశ్వరుడు, ప్రకాశ స్వరూపుడు అగు నీకు నమస్కారము (6). ఇట్లు స్తుతించి మహాదేవునకు సాష్టాంగ ప్రణామము నాచరించి, దక్షిణామూర్తి ఋషిగా గల రుద్రమంత్రమును జపించెను (7). ఆ విష్ణుప్రభుడు నీటిలో నిలబడి మనస్సును తన ప్రభువు, పరమేశ్వరుడు అగు శంభునిపై నిలిపి ఆయనను స్మరిస్తూ ఒకటిన్నర కోట్ల జపమును చేసెను (8). అంతవరకు ఆ దేవతలందరు మహేశ్వరుని మనస్సులో నిలిపి ధ్యానించిరి (9).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 710🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 06 🌴


🌻 Prayer to Śiva - 1 🌻



Vyāsa said:—


1. When the ruler of the Asuras, his brothers and the citizens were thus deluded, O lord Sanatkumāra, what happened? Please mention everything.



Sanatkumāra said:—


2-3. When the Asuras had become so, when they had abandoned the worship of Śiva, when the virtuous rites of chaste women came to an end and evil conduct came to stay, Viṣṇu was apparently contented. Accompanied by the gods, Viṣṇu went to Kailāsa in order to intimate their activities to Śiva.


4-5. Viṣṇu, the gods, Brahmā and others stood near him and with great concentration they meditated on him. Viṣṇu and Brahmā eulogised the omniscient Śiva with pleasing words.



Viṣṇu said:—


6. “Obeisance to you, great lord, the great soul, Nārāyaṇa, Rudra and Brahmā, obeisance to you in the form of Brahman.”


7. After eulogising lord Śiva thus and prostrating at length, he repeated the mantra of Dakṣināmūrti Rudra.


8-9. He repeated the mantra fifteen million times standing in water and concentrating his mind on him. Lord Viṣṇu meditated on the great lord Śiva. In the meantime, the gods too eulogised him with devotion.



Continues....


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Comments


bottom of page