top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 711 / Sri Siva Maha Purana - 711


🌹 . శ్రీ శివ మహా పురాణము - 711 / Sri Siva Maha Purana - 711 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 06 🌴


🌻. శివస్తుతి - 2 🌻



దేవతలిట్లు పలికిరి-


సర్వాత్మకుడు, మంగళకరుడు, కష్టములను పారద్రోలువాడు, నీలకుంఠుడు, చైతన్య స్వరూపుడు, జ్ఞానఘనుడు అగు నీకు నమస్కారము (10). ఆపదలనన్నిటినీ నివారించే నీవే మాకు సర్వకాలములలో శరణు అగుచున్నావు. దేవశత్రువలను సంహరించు వాడా! సర్వకాలములలో మాచే తెలియదగిన వాడవు నీవే (11). నీవు సర్వకారణుడవు. నీకు కారణము లేదు. నీవు ఆనందఘనుడవు, వినాశములేని ప్రభుడవు. ప్రకృతి పురుషులనిద్దరినీ సృష్టించిన జగదీశ్వరుడవు నీవే (12). రజస్సత్త్వ తమోగుణములను స్వీకరించి క్రమముగా బ్రహ్మ విష్ణు రుద్రరూపములను దాల్చి జగత్తులను సృష్టించి పాలించి సహరించు వాడవు నీవే (13).


ఈ లోకములో రక్షకుడవు, సర్వేశ్వరుడవు, నాశము లేనివాడవు, వరముల నిచ్చువాడవు, శబ్దస్వరూపుడవు, శబ్దప్రమాణముచే నిరూపింపబడెడివాడవు, వాచ్యవాచక భావమునకు అతీతుడవు నీవే (14). యోగవిశారదులగు యోగులు ముక్తి కొరకు ఈశానుడవగు నిన్ను ప్రార్థించెదరు. నీవు యోగుల హృదయపుండరీకము నందలి ఆకాశములో స్థిరముగా నుండెదవు (15). పరమబ్రహ్మ స్వరూపుడు, తేజోనిధి, ప్రకృతి కంటె పరుడు అగు నిన్ను పవిత్రములగు వేదములు తత్త్వమసి ఇత్యాది మహా వాక్యములతో ప్రతిపాదించు చున్నవి (16). హే విభో! ఈ జగత్తులోని సర్వము నీవే. పరమాత్ముడవు నీవేనని ఋషులు చెప్పెదరు. హే శర్వా! భవా! సర్వము నీ స్వరూపమే. ముల్లోకములకు ప్రభువు నీవే (17).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 711🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 06 🌴


🌻 Prayer to Śiva - 2 🌻


The gods said:—


10. Obeisance to you, the soul of all, obeisance to Śiva the remover of distress, obeisance to the blue-necked Rudra, obeisance to the knowledge-formed Śiva of great mind.


11. You are our ultimate goal for ever. You are the remover of all adversities. O destroyer of the enemṃs of the gods, you alone are to be respected by us always.


12. You are the beginning. You are the primordial being. You are self-bliss. You are the everlasting lord. You are the lord of the universe, the direct creator of Prakṛti and Puruṣa.


13. You alone are the creator, sustainer and the annihilator of the worlds. Assuming the Guṇas of Rajas, Sattva, and Tamas you are Brahmā, Viṣṇu and Śiva.


14. In this universe, you enable people to cross the ocean of Existence. You are the undecaying lord of all. You are the granter of boons. You are the subject and not the object of speech and contents.


15. You shall be requested for salvation by the Yogins, the formost among those who know the theory of Yoga. You are stationed inside the lotus like heart of the Yogins.


16. The Vedas and the saintly men speak of you as the supreme Brahman. You are a heaped mass of splendour and greater than the greatest. They call you the great principle.


17. What they call the great soul in the universe, O lord, are you yourself, O Śiva soul of all, ruler of the three worlds.



Continues....


🌹🌹🌹🌹🌹


1 view0 comments

Comments


bottom of page