top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 721 / Sri Siva Maha Purana - 721


🌹 . శ్రీ శివ మహా పురాణము - 721 / Sri Siva Maha Purana - 721 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 08 🌴


🌻. రథ నిర్మాణము - 1 🌻



వ్యాసుడిట్లు పలికెను -


తండ్రీ! సనత్కుమారా! నీవు సర్వమునెరింగిన వాడవు. శివభక్త శిఖామణివి. ఈశ్వరుని యందు లగ్నమైన మనస్సు గలవాడువు. పరమేశ్వరుని ఈ అద్భుత గాథను వినిపించితివి (1). బుద్ధిమంతుడగు విశ్వకర్మ శివుని కొరకు నిర్మించిన దేవాత్మకమగు పరమదివ్యరథము యొక్క నిర్మాణమును గూర్చి ఇపుడు వివరించుము (2).



సూతుడిట్లు పలికెను -


ఆ వ్యాసుని ఈ మాటను విని మహర్షి శ్రేష్ఠుడగు ఆ సనత్కుమారుడు శివుని పాదపద్మములను స్మరించి ఇట్లు పలికెను (3).

సనత్కుమారుడిట్లు పలికెను - వ్యాసా! నీవు గొప్ప బుద్ధిశాలివి. ఓ మునీ! రథము మొదలగు వాటి నిర్మాణమును గురించి వినుము. నేను శివుని పాదపద్మములను స్మరించి నా బుద్ధికి తోచిన విధముగా చెప్పెదను (4). అపుడు రుద్రుదేవుని కొరకు విశ్వకర్మ శ్రద్ధతో ప్రయత్న పూర్వకముగా సర్వలోకములను తనలో కలిగియున్న దివ్యరథతమును నిర్మించెను (5). సర్వభూతములు ఆ రతము నందు గలవు. ఆ బంగరు రథము అందరి ప్రశంసల నందుకొనెను. దాని కుడి చక్రము సూర్యుడు కాగా, చంద్రుడు ఎడమ చక్రమాయెను (6). కుడి చక్రమునకు పన్నెండు, ఎడమ చక్రమునకు పదహారు కమ్మీలు ఉండెను. ఓ బ్రాహ్మాణ శ్రేష్ఠా! ఆ కమ్మీల యందు ద్వాదశాదిత్యులు అధిష్టించి యుండిరి (7). గొప్ప వ్రతము గలవాడా! చంద్రుని పదునారు కళలు ఎడమ చక్రము యొక్క కమ్మీలు అయినవి. నక్షత్రములు ఆ ఎడమ చక్రమునకు ఆభరణములైనవి (8). ఓ విప్రశ్రేష్ఠా! ఆరు ఋతువులు ఆ చక్రములను చుట్టి యుండు బద్దీలైనవి. అంతరిక్షము రథమునకు ముందు భాగము ఆయెను. మందర పర్వతము రథములో కూర్చుండు స్థానమాయెను (9). అస్తాచల, ఉదయాచలములు రథమునకు ముందు ఉండు స్తంభములాయెను. మహమేరువు మూలాధిష్ఠానము కాగా, మేరు శిఖరములు అధిష్టానములోని ఇతర భాగములాయెను (10). సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 SRI SIVA MAHA PURANA - 721🌹 ✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj 🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 08 🌴 🌻 The detailed description of the chariot etc. - 1 🌻 Vyāsa said:— 1. O Sanatkumāra, of good intellect, O omniscient one, O foremost among the devotees of Śiva, this wonderful story of lord Śiva has been narrated to us. 2. Now please mention the structure of the chariot[1] which consisted of all the gods and which had been made by the intelligent Viśvakarman. Sūta said:— 3. On hearing these words of Vyāsa, Sanatkumāra the great sage remembered the lotus-like feet of Śiva and spoke thus. Sanatkumāra said:— 4. O sage Vyāsa, of great intellect, listen to the description of the structure of the chariot etc which I shall give to the extent of my intellect after remembering the lotus-like feet of Śiva. 5. The divine chariot of lord Śiva consisting of all the worlds was built by Viśvakarman with devoted effort. 6. It was appreciated by all. It was golden in colour and all the elements had gone into its making. The right wheel was the sun and the left wheel was the moon. 7-8. The right wheel had twelve spokes. O great brahmin, the twelve Ādityas presided over them. The left wheel had sixteen spokes. O you of excellent rites, the sixteen spokes of the left side wheel consisted of the sixteen digits of the moon. All the asterism? embellished the left side. 9. The six seasons constituted the rims of the wheels of the chariot, O great Brahmin. The Puṣkara of the chariot was the sky. The inner side of the chariot was Mandara. 10. The rising and the setting mountains constituted the poleshafts. Mahāmeru was the support and the Keśara mountains the sharp sides. Continues.... 🌹🌹🌹🌹🌹

1 view0 comments

Bình luận


bottom of page