top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 723 / Sri Siva Maha Purana - 723


🌹 . శ్రీ శివ మహా పురాణము - 723 / Sri Siva Maha Purana - 723 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 08 🌴


🌻. రథ నిర్మాణము - 3 🌻


లోకాలోకపర్వతము రథమునకు నలుపైలా ఉపసోపానమయెను. మానసాది సరోవరములు దానికి బటక ఉండే సుందరమగు విషమ స్థానము ఆయెను (22) వర్ష పర్వతములన్నియు ఆ రథమునకు నలువైపులా ఉండే త్రాళ్లు అయెననె చెప్పబడెను. పాతాళాది అధోలోకములయందు నివసించు ప్రాణులన్నియు ఆరధములకు ఉపరితములు అయెను (23).


బ్రహ్మదేవుడు సారథియై కళ్లెములను పట్టు కొనెను. బ్రహ్మ అధిష్టాన దేవతగా గల ఓంకారము ఆ బ్రహ్మకు చేతి కొరడా ఆయెను (24). ఆకారము పెద్ద గొడుగు ఆయెను. మందర పర్వతము ప్రక్కన ఉండే నిలువు కమ్మీ ఆయెను. హిమవంతుడు శివునకు ధనస్సు కాగా, నాగరాజగు శేషుడు దాని నారిత్రాడు ఆయెను (25). వేదస్వరూపిణి యగు సరస్వతీ దేవి ఆ ధనస్సునకు గంట ఆయెను. మహాతేజశ్శాలి యగు విష్ణువు బాణము కాగా, అగ్ని ఆ బాణము యొక్క వాడి మొన ఆయెనని మహర్షులు చెప్పిరి (26). ఓ మహర్షీ! నాల్గు వేదములు ఆ రథమునకు నాల్గు గుర్రములు ఆయెను. మిగిలియున్న నక్షత్రాది తేజః పిండములు ఆ గుర్రములకు ఆబరణములాయెను (27). విషము నుండి పుట్టిన పదార్థములు సేన కాగా, వాయువులు వాద్యగాళ్లు ఆయెను. వ్యాసాది మహర్షులు ఆ గుర్రములకు సంరక్షకులుగా నుండిరి (28). ఓ మహర్షీ! ఇన్ని మాటలేల? కొద్ది మాటలలో చెప్పెదను. బ్రహ్మాండములో నుండే సర్వవస్తువులు ఆ రథము నందు ఉండెనని చెప్పెదరు (29). ఇట్లు బుద్ధిమంతుడగు ఆ విశ్వకర్మ బ్రహ్మ విష్ణువుల యాజ్ఞచే శుభకరమగు ఆ రథమును చక్కగా నిర్మించెను (30).


శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో రథ నిర్మాణ వర్ణనమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 723🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 08 🌴


🌻 The detailed description of the chariot etc. - 3 🌻


22. The Lokāloka mountain[3] formed its side steps. The lake mānasa etc. constituted its brilliant outer and oblique steps.


23. The Varṣa mountains constituted the cords and chains all round the chariot. All the residents of the region Tala constituted the bottem surface of the chariot.


24. Lord Brahmā was the charioteer, the gods were holders of the bridle. Praṇava the Vedic divinity constituted the long whip of Brahma.


25. The syllable A constituted the great umbrella, Mandara the side staff. The lord of mountains became his bow and the lord of serpents the bowstring.


26. Goddess Sarasvatī in the form of the Vedas constituted the bells of the bow. The brilliant Viṣṇu became the arrow and Agni the spear-head.


27. O sage, the four Vedas are said to be his horses. The remaining planets became their embellishments.


28. His army came up from water. The winds were his feathers, wings etc. Vyāsa and other sages were the drivers of the vehicle.


29. O great sage, why should I dilate. I shall succinctly say. Everything in the world found a place in the chariot.


30. At the bidding of Brahmā and Viṣṇu the chariot and its adjuncts were created bythe intelligent Viśvakarman.[4]



Continues....


🌹🌹🌹🌹🌹

1 view0 comments

コメント


bottom of page