🌹 . శ్రీ శివ మహా పురాణము - 724 / Sri Siva Maha Purana - 724 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 09 🌴
🌻. శివుని యాత్ర - 1 🌻
సనత్కుమారుడిట్లు పలికెను -
ఇటువంటి మమాదివ్యమైన, అనేకములగు ఆశ్చర్యములతో కూడియున్న రథమయునకు వేదములనే గుర్రములను పూన్చి బ్రహ్మ శివునకు అర్పించెను (1). దేవదేవుడు, విష్ణువు మొదలగు దేవతలచే కొలువబడువాడు, శూలధారి యగు శంభుని పరిపరివిధముల స్తుతించి బ్రహ్మ ఆయనను రథమును అధిష్టింపజేసెను (20). సర్వదేవతా స్వరూపుడు, మహాప్రభుడునగు శంభుడు అపుడు రథసామగ్రితో కూడిన ఆ దివ్య రథమును అధిష్టించెను (3). అపుడాయనను ఋషులు, దేవతలు, గంధర్వులు, నాగులు, విష్ణువు, బ్రహ్మ మరియు లోకపాలకులు స్తుతించిరి (4). సంగీతకుశలురగు అప్సరసల గణములు చుట్టు వారి యుండగా, సారథియగు బ్రహ్మను గాంచినవాడై, వరములనిచ్చు ఆ శంభుడు విరాజిల్లెను (5). లోకములోని వస్తువులచే రచింపబడిన ఆ రతమును శివుడు అధిరోహించగానే, వేదముల నుండి పుట్టిన గుర్రములు శిరస్సులై గూలినవి (6).
భూమి కంపించెను. పర్వతములన్నియు చలించినవి. శివుని భారమును సహించలేక శేషుడు శీఘ్రమే భయ విహ్వలుడై కదలాడి పోయెను (7). అపుడు భూమిని మ్రోయు శేష భగవానుడు గొప్ప ఎద్దురూపముతో ఆ రథము క్రిందకు జేరి క్షణములో దానిని పైకి ఎత్తి నిలబెట్టెను (8). కాని రథము నదిష్ఠించియున్న మహేశ్యరుని గొప్ప తేజస్సును సహింప జాలక ఆయన కూడ మరుక్షణమలో మోకాళ్లపై నేలగూలెను (9).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 724🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 09 🌴
🌻 Śiva’s campaign - 1 🌻
Sanatkumāra said:—
1. Brahmā handed over that divine chariot of various wonderful features to Śiva after yoking the Vedas as the horses.
2. After dedicating the same to Śiva, he requested Śiva the lord of the gods, approved by Viṣṇu and other gods to mount the chariot.
3. The great lord Śiva identifying himself with all the gods got into that chariot that had various scaffoldings attached to it.
4. He was then eulogised by the gods, Gandharvas, serpents, sages, Viṣṇu, Brahmā and the guardians of the quarters.
5-6. Śiva, the granter of boons, surrounded by the groups of damsels, experts in music, shone well. Glancing at the charioteer when he mounted the chariot concocted with everything in the world, the horses constituted by the Vedas fell headlong to the ground.
7. The earth quaked. The mountains became tremulous. Śeṣa, unable to bear his weight, became distressed and soon began to tremble.
8. Lord Viṣṇu assumed the form of a lordly bull and went under the chariot. He lifted it up and steadied it for a short while.
9. But in another instant, unable to bear the weighty splendour of lord Śiva seated in the chariot, the lordly bull had to kneel down and crawl on the ground.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments