top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 728 / Sri Siva Maha Purana - 728


🌹 . శ్రీ శివ మహా పురాణము - 728 / Sri Siva Maha Purana - 728 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 10 🌴


🌻. త్రిపుర దహనము - 1 🌻


సనత్కుమారుడిట్లు పలికెను-


అపుడు సర్వసామగ్రితో కూడి రథమునందున్న మహాదేవుడగు శంభుడు ఆ రాక్షసుల త్రిపురములను సంపూర్ణముగా దహించి వేయుటకు సన్నద్ధుడై యుండెను (1). ఆయన రథము యొక్క అగ్రాసనమునందు ఒక కాలు ముందుకు మరియొక కాలు వెకకు వేసి యుండే అద్భుతమగు రథిక విన్యాసము గలవడై ఆ ధనస్సున్కు నారిత్రాటిని తగిల్చి గొప్ప బాణమును దానిపై సంధించెను (2). ధనస్సను పిడికిలి యందు గట్టిగా పట్టి చూపును చూపుతో కలిపి నిశ్చలముగా అచట ఆయన లక్ష సంవత్సరములు నిలబడెను (3). అపుడు గణపతి ఆయన బొటనవ్రేలి యందున్నవాడై నిరంతరమగు పీడను కలిగించగా, త్రిశూలధారియగు శివుని ఆ బాణములు త్రిపురములు అనే లక్ష్యమును చేరలేకపోయినవి (4). ధనుర్బాణములను ధరించి యున్నవాడు, జటాజూటధారి, ముక్కంటి యగు హరుడు ఆకాశము నుండి పరమ మంగళకరమగు వచనమును వినెను (5). హే భగవాన్‌! జగదీశ్వరా! ఈశా! నీవు వినాయకుని పూజించనంత వరకు త్రిపురనాశము సంభవము కాదు (6). అంధకాసురుని సంహరించని శివుడు ఈ మాటను విని భద్రకాళిని పిలిచి గజాననుని పూజించెను (7).


సర్వకార్యములకు ముందు ఉండే వినాయకుడు ఈ తీరున పూజింపబడి సంతసించెను అపుడు హరభగవానుడు ఆకాశమునందు (8). మహాత్ములగు తారకాక్షుడు మొదలగు రాక్షసుల త్రిపురములను గాంచెను. ఆ నగరములు ఎప్పటివలెనే యోగ్యముగా నుండెను. కొందరు ఇట్లు చెప్పుచున్నారు (9). పరబ్రహ్మ, దేవదేవుడు, సర్వులచు ఉపాసింపబడు వాడు అగు మహేశ్వరుని యందు ఇతర దేవతానుగ్రహముచే కార్యము సిద్ధించుట అనునది ఘటిల్లదు గదా! (10).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 728🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 10 🌴


🌻 The burning of the Tripuras - 1 🌻



Sanatkumāra said:—


1. Then Śiva, the great lord, seated in the chariot and equipped with everything, got ready to burn the three cities completely, the cities of the enemies of the gods.


2-3. The lord stood in the wonderful posture of Pratyālīḍha for a hundred thousand years. The bow was well strung and kept near the head. The arrow was fixed. The fingers clenched at the bow firmly. The eyes were fixed.


4. Gaṇeśa was stationed on the thumb. During this time the three cities did not come within the target path of the trident-bearing lord.


5. Then from the firmament, the odd-eyed Śiva who was standing there holding the bow and the arrow heard an auspicious voice.


6. “O lord of the master of the universe, you will not kill the Tripuras as long as the lord Gaṇeśa is not adored”.


7. On hearing these words, Śiva the destroyer of Andhaka called Bhadrakālī and worshipped the elephant-faced god Gaṇeśa.


8-9. When Gaṇeśa was worshipped, when he standing ahead was pleased, lord Śiva saw the three cities of the powerful Asuras, sons of Tāraka, joined together.


10. It is said that when the great lord Śiva, the lord of the Gods, the supreme Brahman, worshipped by all is there, it is not proper -to say that he achieved success by another God’s grace.



Continues....


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Comments


bottom of page