🌹 . శ్రీ శివ మహా పురాణము - 730 / Sri Siva Maha Purana - 730 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 10 🌴
🌻. త్రిపుర దహనము - 3 🌻
పరమేశ్వరుడు, సత్పురుషులకు శరణ్యుడు అగు ఆ ముక్కంటి దైవము ఆ మూడు పురములను ఓణములో భస్మము చుయుటకు సమర్ళడు. ఓ ఈశ్వరా! నీవు ఆ పురములకు బాణములను గురిపెట్టుము (22). ఓ దేవేవా! నీవు నీ కంటి చూపుచు ముల్లోకములను భస్మము చేయ సమర్థుడవు. కాన మా కీర్తిని ఇనుమడింప చుయుట కొరకై ఆ బాణమును ప్రయోగించుము (23). విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలందరు ఇట్లు స్తుంతించగా, మహేశ్వరుడు ఆ త్రిపురములను బాణముచే దహించుటకు నిశ్చయించెను (24). అభిజిల్లగ్నము నందు శంకరుడు అద్భుతమగు ఆ ధనస్సను ఎక్కుపెట్టి, మిక్కిలి సహింపశక్యము కాని సింహనాదమును చేయుచూ నారిత్రాటిని మీటజొచ్చెను (25).
తన పేరును అందరికీ వినపించి, ఆ గొప్ప రాక్షసులను బిగ్గరగా ఆహ్వానించి, భయంకరాకారుడగు శివుడు కొటిసూర్యుల కాంతితో ప్రకాశించే ఆ బాణమును విడిచిపెట్టెను (26). సమస్త దోషములను తొలగించునది, విష్ణుస్వరూపమైనది, వేగముగా పయనించునది, భయంకరముగా మండుచున్నది అగు ఆ అగ్నిబాణము త్రిపురమునందున్న ఆ ముగ్గురు రాక్షసులను కాల్చివేసెను (27). అపుడా మూడు పురములు దగ్ధమై బూడిద రూపములో ఒక్కసారి, నాల్గుసముద్రములు మేకలగా గల పృథివిపై పడినవి (28).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 730🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 10 🌴
🌻 The burning of the Tripuras - 3 🌻
22. Śiva is capable of reducing the three cities to ashes in a trice, Still lord Śiva, the goal of the good bides his time.
23. The lord of gods is capable of burning the three worlds by a single glance. O lord, for the flourish of our fame you shall discharge the arrow.
24. On being eulogised by Viṣṇu, Brahmā and other gods, lord Śiva desired to reduce the three cities to ashes with his arrow.
25-26. In the auspicious moment called Abhilāṣa he drew the bow and made a wonderful and unbearable twanging sound. He addressed the great Asuras and proclaimed his own name. Śiva discharged an arrow that had the refulgence of countless suns.
27. The arrow which was constituted by Viṣṇu and whose steel head was fire god blazed forth and burnt the three Asuras who lived in the three cities. It thereby removed their sins.
28. The three cities reduced to ashes fell on the earth girt by the four oceans[3].
Continues....
🌹🌹🌹🌹🌹
Comments