🌹 . శ్రీ శివ మహా పురాణము - 732 / Sri Siva Maha Purana - 732 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 10 🌴
🌻. త్రిపుర దహనము - 5 🌻
కొందరు సగము కాలి తెలివి తెచ్చుకొని మోమముతో ఇటునటు పరువలెత్తి మూర్ఛిల్లిరి. ఘోరమగు ఆ అగ్నిచే దహింపబడని సూక్ష్మమగు వస్తవు అయిననూ ఆ త్రిపురములో లేకుండెను (38). కదలాడని జడములు గాని, కదలాడే ప్రాణులు గాని దహింపబడకుండగా విడువబడినవి అచట లేకుండెను. రాక్షసుల విశ్వకర్మయగు మయాసురునకు వినాశము లేదు. ఆయన తక్కసర్వము నశించెను (39).
యముడు దేవతలకు విరోధి కాదు. ఆపత్కాలమునందైననూ మహాభక్తుడు, మహేశుని శరణు పొందిన వాడు అగు యముడు శంభుని తేజస్సుచే రక్షింపబడెను (40). రాక్షసులు గాని, ఇతర ప్రాణులు గాని చేయు కర్మలు, పరిత్యజించు కర్మలు, మరియు వారి రాగద్వేషములు పతనహేతువులు కానిచో, వారికి వినాశము కలుగదు (41). కావున సత్పురుషులు మిక్కిలి యోగ్యమగు కర్మను ఆచరించుటకై యత్నించవలెను. పాపకర్మచు ఇహపరములు నశించును. కావున అట్టి నిందనీయమగు కర్మను చేయరాదు (42). త్రిపురవాసులకు ఘటిల్లిన సంగము వంటి సంగము ఇతరులకు కలుగకుండు గాక ! అట్టి సంగము దైవవశమున సంప్రాప్తమైనచో, దానిని సర్వులు స్వీకరించవలసినదే గదా! (43). ఆ రాక్షసులు బంధులతో గూడి త్రిపురములో నున్నవారై శివుని పూజించిరి గదా! వారందరు ఆ శివపూజానుష్ఠనప్రభావముచే గాణపత్య స్థానమును పొందిర (44).
శ్రీ శివ మహా పురాణములోని రుద్ర సంహితయందు యుద్ధఖండలో త్రిపురదాహ వర్ణనమనే పదియవ ఆధ్యాయము ముగిసినది (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 732🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 10 🌴
🌻 The burning of the Tripuras - 5 🌻
38-39. Some who were partially burnt woke up and rushed here and there. They fell unconscious and fainted. There was not even a minute particle whether mobile or immobile which escaped unscathed by that terrible Tripura fire excepting Maya, the imperishable Viśvakarman of the Asuras.
40. Those who were not opposed to the Gods were saved by Śiva’s brilliance, those who devoutly sought refuge in lord Śiva at the time of adversity.
41. Whether Asuras or other beings those whose collective activities were not destructive were saved; others of contrary activities were burnt in fire.
42. Hence, all possible efforts shall be made by good men to avoid despicable activities whereby people waste away themselves.
43. Let there be no predicament to any as it happened in regard to the residents of the three cities. This is the opinion of all. By chance if it happens, let it.
44. Those who worshipped Śiva along with their family attained Gaṇapati’s region, thanks to the worship of Siva.
Notes on the Burning of Tripura:
The Purāṇas accord different versions of the burning of Tripurī. The present version is a regular legend based on an ancient tradition. There is however another version which describes graphically the devastation, oppression and barbarities practiced by the Gaṇas which remind us of those perpetrated by the Hūṇa-chief Mihirakula in his invasions There is a veiled allusion to this event, for Agni is addressed as a Mleccha (Matsya p. I88. 51). There is no such anachronism in the ŚP account of Tripuradāha.
Continues....
🌹🌹🌹🌹🌹
Opmerkingen