top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 738 / Sri Siva Maha Purana - 738


🌹 . శ్రీ శివ మహా పురాణము - 738 / Sri Siva Maha Purana - 738 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 12 🌴


🌻. మయస్తుతి - 1 🌻


సనత్కుమారుడిట్లు పలికెను -


ఇంతలో శంభుడు ప్రసన్నుడగుటను గాంచి, శంభుని అనుగ్రహ బలముచే దహింప బడలని మయాసురుడు ఆనందముతో అచటకు వచ్చెను (1). అతడు చెతులు జోడించి శివునకు ప్రీతితో నమస్కరించి, ఇతర దేవతలకు గూడ నిశ్శంకముగా నమస్కరించి, మరల శివునకు సాష్టాంగ నమస్కారమును చేసెను (2). దానవ శ్రేష్ఠుడగు ఆ మయుడు అపుడు లేచి శివుని చూచి ప్రేమతో బొంగురు వోయిన కంఠస్వరము గలవాడై, భక్తితో నిండిన అంతరంగము గలవాడై ఇట్లు స్తుతించెను (3).


మయుడిట్లు పలికెను -


దేవ దేవా! మహా దేవా! భక్తప్రియా! శంకరా! కల్పవృక్ష స్వరూపుడవగు నీకు స్వపర భేదము లేదు (4). జ్యోతిస్స్వరూపుడవగు నీకు నమస్కారము. జగద్రూపుడవగు నీకు నమస్కారము. పవిత్రమగు అంతఃకరణము గల నీకు నమస్కారము. పవిత్రము చేయు నీకు అనేక నమస్కారములు (5). చిత్రమగు ఆకారము గల వాడవు, నిత్యుడవు, రూపములకు అతీతమైన వాడవు అగు నీకు నమస్కారము. దివ్య స్వరూపుడవు. దివ్యమగు ఆకారము గలవాడవు అగు నీకు నమస్కారము (6). నమస్కరించిన వారి కష్టముల నన్నిటినీ నశింపచేయువాడు. మంగళ స్వరూపుడు, ముల్లోకములను సృష్టించి భరించి పోషించి లయమును చేయువాడు అగు నీకు అనేక నమస్కారములు (7). భక్తిచే పొందదగినవాడు, భక్తులయోడ దయతో నిండినవాడు, తపస్సునకు యోగ్యమగు ఫలము నొసంగువాడు, పార్వతీపతి, మంగళరూపుడు, జగదీశ్వరుడు అగు నీకు నమస్కారము (8). ఓ శ్రేష్ఠమగు ప్రభువా! నీవు స్తోత్రప్రియుడవు. కాని స్తుతించుట నేను ఎరుంగను. ఓ సర్వేశ్వరా! నీవు ప్రసన్నుడవై శరణు జొచ్చిన నన్ను రక్షింపుము (9).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 738🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 12 🌴


🌻 The Gods go back to their abodes (Maya’s prayer) - 1 🌻



anatkumāra said:—


1. In the meantime the Asura Maya who was not burnt due to the strength of grace, came there on seeing Śiva delighted.


2. With great delight he bowed to Śiva and other gods. With palms joined in reverence and with stooping shoulders he bowed to Śiva again.


3. Then he got up. Maya the foremost among the Asuras, with his mind full of devotion and voice choked with emotions of love he eulogised facing Śiva.



Maya said:—


4. O great lord, lord of the Gods and favourably disposed to your devotees, O Śiva, you are in the form of the wish-yielding Kalpa tree and devoid of special leaning to any side.


5. Obeisance to you O splendour-formed, obeisance to you omniformed; obeisance to you, O sanctified soul; obeisance to you, O holy one.


6. Obeisance to you of variegated forms; to you, the eternal one; obeisance to you who extend beyond all forms. Obeisance to you of divine forms, shapes, and features.


7. Obeisance to the destroyer of the distress of those who bow to you; obeisance to the welfare-hearted; to the creator, sustainer and annihilator of the three worlds.


8. O Śiva, O consort of Pārvatī, obeisance to you who are accessible through devotion of the devotees; obeisance to the compassionate and the bestower of the good fruits of penance.


9. O great lord, fond of eulogy, I know not how to eulogise you. O lord of all, be pleased. Save me who have sought refuge in you.”



Continues....


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Comments


bottom of page