top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 740 / Sri Siva Maha Purana - 740


🌹 . శ్రీ శివ మహా పురాణము - 740 / Sri Siva Maha Purana - 740 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 12 🌴


🌻. మయస్తుతి - 3 🌻


సనత్కుమారుడిట్లు పలికెను - మహాత్ముడగు శంకరుని ఈ ఆజ్ఞను శిరసా వహించి అతడు దేవతలకు కూడ నమస్కరించి వితలలోకమునకు వెళ్లెను (20). ఇంతలో ఆ ముండిత శిరస్కులగు సన్న్యాసులు అచటకు వచ్చి బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలందరికీ ప్రణమిల్లి ఇట్లు పలికిరి (21). దేవతలారా! మేము ఎచ్చటకు పోవలెను? ఏ పనిని చేయవలెను? మీ ఆజ్ఞను నిర్వర్తించు మమ్ములను శీఘ్రముగా ఆజ్ఞాపించుడు (22). ఓ విష్ణూ! ఓ బ్రహ్మా! దేవతలారా! మేము చెడు పనిని చేసితిమి. విభక్తులగు రాక్షసుల శిభక్తిని చెడగొట్టితిమి (23). మాకు కోటికల్పముల వరకు నరకవాసము తప్పదు. శివభక్తి విరోధులమగు మమ్ములను ఉద్ధరించువాడు నిశ్చయముగా ఉండబోడు (24). కాని మీ కోర్కెననుసరించి ఈ చెడు పనిని మేము చేసితిమి. దయతో దానికి ప్రాయశ్చిత్తమును చెప్పుడు. మేము మిమ్ములను శరణు జొచ్చితిమి (25). ఆ సన్న్యాసులు ఇట్లు పలికి చేతులు జోడొంచి ఎదురుగా నిలబడి. వారి. ఆ మాటలను విని, విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతలు ఇట్లు పలికిరి (26).


విష్ణువు మొదలగు దేవతలు ఇట్లు పలికిరి - ఓ సన్న్యాసులారా! మీరు ఎన్నటికీ భయపడకు. ఈ ఉత్తమమగు వృత్తాంతమంతయూ శివుని ఆజ్ఞచే ఘటిల్లినది (27). మీకు దుఃఖదాయకమగు దుర్గతి ఎన్నటికీ కలుగబొదు. ఏలయనగా, మీరు శివుని ఆజ్ఞచే దేవతలకు, ఋషులకు హితమును చేసియున్నారు (28). దేవతలకు, ఋషులకు హితమును చేయు శివునకు దేవర్షులకు హితము చేయువారియందు ప్రీతి మెండు. దేవతలకు, ఋషులకు హితమును చేయు మానవులకు ఎన్నటికీ దుర్గతి కలుగబోదు (29).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 740🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 12 🌴


🌻 The Gods go back to their abodes (Maya’s prayer) - 3 🌻



Sanatkumāra said:—


20. Receiving this behest of Śiva, the great soul with bowing head and paying homage to him and to the gods he went to Vitala.


21. In the meantime those heretics of tonsured heads came there, knelt before Viṣṇu, Brahmā and others and spoke.


22. O gods, where shall we go? What shall we do now? We are ready to carry out your behests. Please command us quickly.


23. O Viṣṇu, O Brahmā, O gods, wicked deeds have been performed by us. We have destroyed the devotion to Śiva of all the Asuras who were great devotees of Śiva.


24. We will have to stay in hell for a countless Kalpas. Certainly there is no redemption for us that have offended devotees of Śiva.


25. But it was in accordance with your desire that this wicked deed was perpetrated. Please tell us the mode of atoning for the same. We have sought refuge in you.



Sanatkumāra said:—


26. On hearing their words Viṣṇu, Brahmā and other gods spoke to the tonsured-heads who stood in front with joined palms.



Viṣṇu and others said:—


27. “O tonsured ones, you need not be afraid at all. These excellent activities have taken place at the bidding of Śiva.


28. Since you are the servants of Śiva and have carried out the activities conducive to the welfare of the gods and the sages, no mishap shall ever befall you bringing you to distress.


29. Śiva performs deeds conducive to the welfare of the gods and the sages. He is pleased with those who work for the welfare of the gods and sages. No mishap befalls those who work for the welfare of the gods and sages.


Continues....


🌹🌹🌹🌹🌹


1 view0 comments

Comments


bottom of page