🌹 . శ్రీ శివ మహా పురాణము - 741 / Sri Siva Maha Purana - 741 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 12 🌴
🌻. మయస్తుతి - 4 🌻
ఈనాటి నుండియూ కలియుగములో ఈ మతములో ప్రవేశించిన మానవులకు దుర్గతి కలుగును. మేము సత్యమును పలుకుచున్నాము. దీనిలో సందేహము లేదు (30). ధీరులగు ఓ సన్న్యాసులారా! మీరు నా ఆజ్ఞచే కలి వచ్చువరకు ఎడారి ప్రదేశమును ఆశ్రయించి రహస్యముగా ఉండుడు (31). కలి ప్రవేశించగానే మీరు మీ మతమును స్థాపించుడు. మూర్ఖులు అజ్ఞానమునకు వశులై కలియుగములో మీ మతమును స్వీకరించగలరు (32). ఓ మహర్షి! దేవోత్తములు ఇట్లు ఆజ్ఞాపించగా, ఆ సన్న్యాసులు నమస్కరించి, తమకు నిర్దేశంపబడిన నివాస స్థానమునకు వెళ్లిరి (33).
మహాయోగియగు ఆ రుద్రబగవానుడు త్రిపురవాసులను భస్మము చేసి కృతకృత్యుడై బ్రహ్మాదులచే పూజింపబడెను (34). సర్వగణములతో, పార్వతీ దేవితో మరియు పుత్రులతో కూడియున్న ఆ ప్రభుడు దేవతలకొరకై ఆ మహాకార్యమును నిర్వర్తించి అంతర్థానమును చెందెను (35). శివదేవుడు పరివారముతో గూడి అంతర్థానము కాగానే, థనస్సు, బాణము, రథము మొదలగు సామగ్రి కూడ అంతర్ధానమయ్యెను (36). అపుడు బ్రహ్మ, విష్ణువు, దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు, సర్పములు, అప్సరసలు మరియు మానవులు మిక్కిలి సంతసించినవారై (37). శివుని యశస్సును ఆనందముతో గానము చేయుచూ, తమ తమ నెలవులకు బయలుదేరిరి. వారు తమ తమ నెలవులకు చేరి పరమానందమును పొందిరి (38). త్రిపురాసుర సంహారము అనే గొప్ప లీలతో గూడియున్న, చంద్రశేఖరుని మహాచరిత్రమునంతనూ నీకీ తీరున వివరించితిని (39).
ఈ ధన్యమగు వృత్తాంతము కీర్తిని, ఆయుర్దాయమును ఇచ్చి ధనధాన్యములను వృద్ధి పొందించుటయే గాక, స్వర్గమును మోక్షమును కూడ ఇచ్చును. నీవు ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (40) ఈ గొప్ప వృత్తాంతమును నిత్యము పఠించువాడు, మరియు వినువాడు ఇహలోకములో సమస్త భోగముల ననుభవించి, దేహత్యాగానంతరము మోక్షమును పొందును (41).
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందలి యుద్ధఖండములో మయస్తుతివర్ణనమనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 741🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 12 🌴
🌻 The Gods go back to their abodes (Maya’s prayer) - 4 🌻
30. From now onwards in the Kali age those who follow this cult will be faced with disastrous results. We tell you the truth. There is no doubt about it.
31. O brave tonsured heads, till the advent of the Kali age, you shall stay incognito in the desert region.[2] That is my behest.
32. When the Kali age begins, you can propagate your cult. In the Kali age deluded fools will follow your cult.
33. Thus bidden by the great gods, O great sage, the tonsured heads bowed to them and went to their allotted abode.
34-35. Then lord Śiva, the great Yogin after burning the residents of the three cities felt contented. He was duly worshipped by Brahmā and others. Then the lord, after completing the task of the gods, vanished from the scene accompanied by his Gaṇas, goddess Pārvatī and the sons.
36. When lord Śiva had vanished with his followers, the fortress too vanished along with the bow, arrows, chariot and other things.
37-38. Then Brahmā, Viṣṇu, the gods, sages, Gandharvas, Kinnaras, Nāgas, serpents, celestial damsels and the delighted men went to their abodes praising the glory of Śiva. After reaching their abodes they were highly delighted.
39. Thus the exalted narrative of the moon-crested lord indicative of the annihilation of Tripuras coupled with the great divine sports has been narrated to you.
40. It is conducive to wealth, fame, and longevity. It increases prosperity and possession of food-grains. It yields heavenly pleasure and salvation. What else do you wish to hear?
41. He who reads and hears the exalted narrative will enjoy all pleasures here and attain salvation hereafter.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments