🌹 . శ్రీ శివ మహా పురాణము - 743 / Sri Siva Maha Purana - 743 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 13 🌴
🌻. జలంధర వృత్తాంతములో ఇంద్రుడు ప్రాణములతో బయటపడుట - 2 🌻
ఇంద్రుడిట్లు పలికెను -
ఓయీ! నీవెవరిని? ఎచటనుండి వచ్చితివి? నీ పేరేమి? సత్యమును పలుకుము. శంబుడు తన ధామునందే ఉన్నాడా? లేక ఆ ప్రభుడు ఎచటి కైననూ వెళ్లియున్నాడా? (10)
సనత్కుమారుడిట్లు పలికెను -
ఇంద్రుడిట్లు ప్రశ్నించగా ఆ తాపసుడు ఏమియూ పలుకలేదు. ఇంద్రుడు మరల ప్రశ్నించగా ఆ తాపసుడు సమాధానము నీయలేదు (11). లోకములకు ప్రభువగు ఇంద్రుడు మరల ప్రశ్నించెను. మహాయోగి, లీలచే వివిధరూపములను దరించువాడు అగు ఆ ప్రభుడు మిన్నకుండెను (12). ఈ విధముగా ఇంద్రుడు అనేక పర్యాయములు ప్రశ్నించెను. కాని దిగంబరుడగు ఆ భగవానుడు ఇంద్రుని జ్ఞానమును పరీక్షింప గోరి, ఏమియు పలుకలేదు (13). ముల్లోకముల ఐశ్వర్యముచే గర్వించియున్న దేవేంద్రుడు అపుడు కోపించి, ఆ జటాధారిని గద్దించి ఇట్లు పలికెను (14).
ఇంద్రుడిట్లు పలికెను -
ఓరీ! నేను ప్రశ్నించు చున్ననూ నీవు ఉత్తరము నీయకున్నావు. కావున నిన్ను వజ్ర ముతో సంహరించెదను. ఓరీ దుర్బుద్ధీ! నిన్ను కాపాడు వారెవరు గలరు? (15)
సనత్కుమారుడిట్లు పలికెను -
వజ్రధారియగు ఇంద్రుడు ఇట్లు పలికి, ఆ దిగంబరుని కోపముతో చూచి ఆతనిని సంహరించుటకు వజ్రమును పైకి ఎత్తెను (16). ఇంద్రుడు వజ్రమును ఎత్తుటను గాంచి, సదా మంగళస్వరూపుడగు శంకరదేవుడు ఆ వజ్రపు దెబ్బను స్తంభింపజేసెను. (17). అపుడు రుద్రుడు క్రోధావేశమును పొంది, భయంకరమగు కన్నులు గలవాడై తేజస్సుతో దహించి వేయునా యన్నట్లు మండిపడెను (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 743🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 13 🌴
🌻 Resuscitation of Indra in the context of the destruction of Jalandhara - 2 🌻
Indra said:—
10. O, who are you? Where have you come from? What is your name? Tell me truly. Is the lord Śiva in his apartment or has he gone anywhere?
Sanatkumāra said:—
11. O sage, on being asked by Indra thus, he did not say anything. Indra asked him again. But the naked person did not say anything.
12. Indra, the supreme lord of the worlds, asked again. The lord the great Yogin who assumes forms variously kept quiet.
13. The naked lord, though asked repeatedly by Indra, did not say anything, for he wanted to test the knowledge of Indra.
14. Then the lord of Gods, proud of the wealth of the three worlds, became enraged. Rebuking the lord with matted hair he spoke these words.
Indra said:—
15. “O evil-minded one, though asked you did not reply to me. Hence I am going to kill you with my thunderbolt. Who can save you?”
Sanatkumāra said:—
16. After saying this and looking at him ferociously Indra raised his thunderbolt in order to kill him.
17. On seeing Indra lifting up his thunderbolt, Śiva prevented the fall of the thunderbolt by making his hand benumbed.
18. Then Śiva became furious. His eyes became terrible. He blazed with his burning splendour.
Continues....
🌹🌹🌹🌹🌹
Comentarios