🌹 . శ్రీ శివ మహా పురాణము - 748 / Sri Siva Maha Purana - 748 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 14 🌴
🌻. జలంధరుని జన్మ, వివాహము - 1 🌻
వ్యాసుడిట్లు పలికెను -
సనత్కుమారా! సర్వము నెరింగిన వాడా! బ్రహ్మపుత్రా! నీకు నమస్కార మగుగాక! నేనీ నాడు మహాత్ముడగు శంభుని అద్భుతమగు ఈ కథను వింటిని (1). ఓ పూజ్యా! తండ్రీ! లలాటనేత్రమునుండి పుట్టిన తన తేజస్సును శివుడు సముద్రములోనికి విసిరివేసిన పిదప అచట ఏమాయెను? ఆ విషయమును శీఘ్రముగా చెప్పుము (2).
సనత్కుమారుడిట్లు పలికెను -
వత్సా! నీవు గొప్ప బుద్ధిమంతుడవు. మహాద్భుతమగు శివలీలను వినుము. ఏ భక్తుడు దీనిని శ్రద్ధతో వినునో, అతడు యోగులు పొందే గతిని పొందును (3). శివుని ఫాలనేత్రమునుండి పుట్టి సముద్రములోనికి విసిరి వేయబడిన ఆ తేజస్సు అపుడు వెంటనే బాలుని రూపమును పొందెను (4). అచట గంగా సాగరసంగమమునందు, సర్వలోకములకు భయమును కలిగించు ఆ బాలుడు బిగ్గరగా నేడ్చేను (5). ఆ బాలుని రోదనద్వనిచే భూమి అనేక పర్యాయములు కంపించెను. ఆ శబ్దముచే స్వర్గసత్యలోకములలోని జనులు చెవిటివారుగా అయిరి (6). ఆ బాలుని రోదనము వలన లోకములన్నియు భయపడినవి. లోకపాలకుల మనస్సులు భయముతో నిండిపోయినవి (7). ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! ఇన్ని మాటలేల? వత్సా! సర్వమును వ్యాపించిన ఆ శిశువు యొక్క రోదనధ్వనిచే స్థావరజంగమాత్మకమగు జగత్తు అంతయూ కంపించెను (8).
అపుడు ఆ దేవతలు, మునులు అందరు కంగారుపడి వెంటనే లోకములకు పెద్ద, పితామహుడునగు బ్రహ్మను శరణుజొచ్చిరి (9). ఆ దేవతలు మరియు మునులు ఇంద్రునితో గూడి అచటకు వెళ్లి ఆ పరమేష్ఠికి పరణమిల్లి చక్కగా స్తుతించి ఇట్లు పలికిరి (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 748🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 14 🌴
🌻 The birth of Jalandhara and his marriage - 1 🌻
Vyāsa said:—
1. O omniscient Sanatkumāra, son of Brahmā, obeisance be to you. This wonderful story of Śiva, the great soul, has been heard.
2. O sage, when the brilliance born of the eye in the forehead had been cast off into the briny ocean, O dear sir, what happened? Please narrate it quickly.
Sanatkumāra said:—
3. O dear one of great intellect, listen to the extremely wonderful sport of Śiva, on hearing which with faith a devotee attains the goal of Yogins.
4. The brilliance of Śiva born of the eye in the forehead and cast off into the briny sea[1] immediately assumed the form of a boy.
5. At the confluence of the river Gaṅgā and the ocean, the boy of terrific features cried loudly.
6. At the sound of the crying boy, the earth quaked frequently. The heaven and the Satyaloka became deafened at the noise.
7. All the worlds were frightened. The guardians of the quarters became agitated in the mind.
8. O dear holy one, O great brahmin, the entire world including the mobile and immobile quaked at the cries of the boy.
9. Then the distressed gods and the sages immediately sought refuge in Brahmā the grandfather and preceptor of the worlds.
10. After going there, those sages and the gods including Indra bowed to and eulogised Brahmā and spoke these words.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments