top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 751 / Sri Siva Maha Purana - 751



🌹 . శ్రీ శివ మహా పురాణము - 751 / Sri Siva Maha Purana - 751 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 14 🌴


🌻. జలంధరుని జన్మ, వివాహము - 4 🌻



సనత్కుమారుడిట్లు పలికెను -


బ్రహ్మ ఇట్లు పలికి శుక్రుని ఆహ్వానించి ఆ బాలకుని రాజ్యాభిషిక్తుని చేసెను. ఆయన సముద్రుని వద్ద సెలవు తీసుకొని అంతర్ధానమును జెందెను (30). అపుడు ఆ బాలకుని చూచి వికసించే నయనములు గల ఆ సముద్రుడు ఆ కుమరుని తీసుకొని ఆనందముతో స్వగృహమునకు వెళ్లెను (31). ఆనందముతో నిండిన మనస్సు గల సముద్రుడు సర్వావయవముల యందు అందగాడు, ఉల్లాసమును కలిగించువాడు, మహాద్భుతమగు తేజస్సు గలవాడు అగు తన బాలకుని అనేకములగు చక్కని ఉపాయములతో పెంచి పోషించెను (32). అపుడు సముద్రుడు కాలనేమియను గొప్ప రాక్షసుని పిలిచి అతని కుమార్తెయగు వృందను జలంధరునకిచ్చి వివాహమును చేయుమని గోరెను (33). రాక్షసశ్రేష్ఠుడు, వీరుడు, బుద్ధి మంతుడు, తన పనిలో నిపుణుడు అగు కాలనేమి సముద్రుని కోరిక యోగ్యముగా నున్నదని తలంచెను. ఓ మహర్షీ (34) సముద్రపుత్రుడు, వీరుడునగు జలంధరునకు ఆతడు ప్రాణప్రియురాలగు తన కుమార్తెనిచ్చి వేదోక్తవిధానముతో వివాహమును చేసెను (35). వారిద్దరి వివాహములో అపుడు గొప్ప ఉత్సవము జరిగెను. ఓ మహర్షీ ! నదులు, నదములు, సమస్తరాక్షసులు ఆనందమును పొందిరి (36).


భార్యతో గూడియున్న కుమారుని చూచి సముద్రుడు మిక్కలి ఆనందించి, బ్రాహ్మణులకు, మరియు ఇతరులకు యథావిథిగా దానమునిచ్చెను (37). పూర్వము దేవతలచే పరిజితులై పాతాళమునందు తలదాచుకొనిన రాక్షసులు నిర్భయముగా భూమండలమునకు వచ్చి ఆతనిని ఆశ్రయించిరి (38). సముద్రపుత్రుడగు ఆతనికి తన కుమార్తెను కన్యాదానము చేసిన కాలనేమి, మరియు ప్రముఖులగు ఇతరరాక్షసులు మిక్కిలి ఆనందమును పొందినవారై, దేవతలను నిర్జించుట కొరకు ఆతని కొలువులో చేరిరి (39). వీరుడు, సముద్రపుత్రుడు, రాక్షసవీరులలో శ్రేష్ఠుడు అగు ఈ జలంధరుడు మిక్కిలి సుందరియగు భార్యను పొంది, శుక్రుని ప్రభావముచే ఇంద్రియ జయముగలవాడై రాజ్యము నేలెను (40).


శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు యుద్ధ ఖండలో జలంధరుని పుట్టుక, వివాహము అనే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 751🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 14 🌴


🌻 The birth of Jalandhara and his marriage - 4 🌻



Sanatkumāra said:—


30. After saying so he called Śukra and performed his coronation. Brahmā then took leave of the ocean and disappeared.


31. Thereafter the ocean with blooming eyes saw the son, took him to his abode joyously.


32. With a joyous heart he nurtured the boy with diverse great means. The boy grew into a beautiful youth of exquisite limbs and wonderful splendour.


33. Then the ocean invited the great Asura Kālanemi and requested him to give his daughter named Vṛndā in marriage to his son.


34. O sage, the heroic Asura Kālanemi,[2] foremost among the Asuras, intelligent and efficient in his activities, welcomed the request of the ocean.


35. He gave his beloved daughter to Jalandhara, the brave son of the ocean, in marriage performing the nuptial rites according to the Brāhma style.[3]


36. O sage, great festivities were held in the marriage. The rivers and Asuras were happy.


37. The ocean too became extremely happy seeing his son united to a bride. In accordance with the rules he made charitable gifts to the brahmins and others.


38. Those Asuras who had been formerly defeated by the gods and had sought shelter in Pātāla came fearlessly to the Earth and resorted to him.


39. Kālanemi and other Asuras were pleased after giving the daughter in marriage to the son of the ocean. In order to defeat the gods they resorted to him.


40. The heroic son of the ocean, Jalandhara, foremost among the Asura warriors, received a very beautiful lady as his wife and he ruled over the kingdom with the support of Śukra.



Continues....


🌹🌹🌹🌹🌹



1 view0 comments

Opmerkingen


bottom of page