🌹 . శ్రీ శివ మహా పురాణము - 755 / Sri Siva Maha Purana - 755 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 15 🌴
🌻. దేవజలంధర సంగ్రామము - 4 🌻
జలంధరుడిట్లు పలికెను -
ఓ దేవతాధముడా! నీవు నా తండ్రిమగు సముద్రుని పర్మతముతో మథించి నా తండ్రికి చెందిన శ్రేష్ఠవస్తువులనన్నింటినీ గొని పోతివి. ఇట్లు చేయుటకు కారణమేమి? (27). నీవు చేసినది తగని పని. కావున వాటిని వెంటనే నాకు సమర్పించుము. జాత్రగ్తగా ఆలోచించి దేవతలతో సహా నన్ను శరణు జొచ్చుము (28). ఓ దేవాధమా! అట్లు చేయనిచో నీకు గొప్ప భయము కలుగును. రాజ్యము వినాశమగును. నేను సత్యమును పలుకుచున్నాను (29).
సనత్కుమారుడిట్లు పలికెను -
దూత యొక్క ఈ మాటను వినిన దేవేంద్రుడు ఆశ్చర్యపడెను. ఆయన గతమును స్మరించి భయమును మరియు రోషమును పొంది అతనితో నిట్లనెను (30). నాకు భయపడి పారిపోయిన పర్వతములను సముద్రుడు తన గర్భములో దాచినాడు. మరియు అతడు పూర్వము నా శత్రువులగు ఇతరులను కూడా రక్షించినాడు (31). అందువలననే ఆతని శ్రేష్ఠవస్తువులనన్నింటినీ అపహిరించినాను. నాకు ద్రోహమును చేయు వ్యక్తి సుఖముగా మనజాలడు. నేను సత్యమును పలుకుచున్నాను (32). ఇదే విధముగా పూర్వము సముద్ర పుత్రుడగు శంఖాసురుడు మూర్ఖుడగుటచే సత్పురుషులతోడి మైత్రిని విడనాడి నన్ను ద్వేషించుట మొదలిడెను (33). సముద్రుని పుత్రునిగా జన్మించి సాధుసమాజమును హింసిచిన ఆ మహాపాపిని నా తమ్ముడగు విష్ణువు సంహరించినాడు (34). ఓయీ దూతా! కావున నీవు వెంటనే వెళ్లి ఆ సముద్రపుత్రునకు ఈ సత్యమును తెనుపుము. సముద్రమును మథించుటకు గల కారణమునుసమగ్రముగా వివరించుము (35). ఇంద్రడు ఈ తీరున పలికి పంపివేసెను. అపుడు మహాబుద్ధిశాలి, ఘస్మరుడను పేరు గలవాడునగు ఆ దూత శీఘ్రమే వీరుడగు జలంధరుడు ఉన్న స్థానమునకు వెళ్లెను (36).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 755🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 15 🌴
🌻 The fight between the gods and Jalandhara - 4 🌻
Jalandhara said:—
27. ‘'0 base god, why was my father, the ocean, churned by you with the mountain? Why were all the jewels of my father taken away?
28. What you have done is not proper. Return all of them to me immediately. Pondering over this, come along with the gods and seek refuge in me.
29. Otherwise, O base god, you will have a great cause to fear. You will run the risk of the annihilation of your kingdom.”
Sanatkumāra said:—
30. On hearing the words of the messenger, Indra, the the lord of the gods, was bewildered. Remembering the previous incidents he was frightened as well as angry. He spoke to him thus.
31. Indra said. He gave shelter to the mountains who were terribly afraid of me. Others too, some of my enemies, the Asuras, were formerly saved by him.
32 It was due to this that I took away his jewels. Those who oppose me can never remain happy. I am telling you the truth.
33. Formerly the Asura Śaṅkha[4] the son of the ocean was stupid enough to be inimical to me. He was spared by me because he was associated with saintly men.
34. But when his predilection became sinful and he became violent towards saintly men, he was killed in the interior of the ocean by Viṣṇu, my younger brother.
35. Hence O messenger, go immediately and explain to the Asura, son of the ocean, our purpose for churning the ocean.”
Sanatkumāra said:—
36. Dismissed thus by Indra, the intelligent emissary Ghasmara hastened to the place where the heroic Jalandhara was present.
Continues....
🌹🌹🌹🌹🌹
댓글