🌹 . శ్రీ శివ మహా పురాణము - 757 / Sri Siva Maha Purana - 757 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 15 🌴
🌻. దేవజలంధర సంగ్రామము - 6 🌻
నేలగూలినట్టియు, మరియు నేల గూలుచున్న ఏనుగులతో, గుర్రములతో, రథములతో మరియు సైనికులతో ఆ యుద్ధభూమి మేఘపు తునకలతో గూడిన సంధ్యాకాలపు టాకాశము వలె ప్రకాశించెను (46). శుక్రుడు మృతసంజీవినీ మంత్రమును పఠించి, ఆ మంత్రించిన జలములను చల్లి అచట యుద్ధములో మరణించిన రాక్షసులను మరల బ్రతికించెడివాడు (47). అదే విధముగా అంగిరసుడు ద్రోణపర్వతమునుండి అనేకపర్యాయములు దివ్యమగు ఓషధులను తెచ్చి యుద్ధమునందు అసువులను బాసిన దేవతలను జీవింపజేసెడివాడు (48). యుద్ధములో మరణించియు మరల బ్రతికి వచ్చిన దేవతలను గాంచి జలంధరుడు మిక్కిలి కోపించి శుక్రాచార్యునితో నిట్లనెను (49).
జలంధరుడిట్లు పలికెను - నా చేతిలో మరణించిన దేవతలు యుద్ధరంగములో మరల జీవించుట ఎట్లు సంభవమగుచున్నది? సంజీవినీ విద్య మరియొకని వద్ద లేదని నేను విని యుంటిని (50).
సనత్కుమారుడిట్లు పలికెను - ఆ సముద్రతనయుని వాక్యమును విని గురువగు శుక్రాచార్యుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై జలంధరునకిట్లు బదులిడెను (51).
శుక్రుడిట్లు పలికెను - వత్సా! అంగిరసుడు ద్రోణపర్వతమునుండి దివ్యమగు ఓషధులను తెచ్చి దేవతలను బ్రతికించుచున్నాడు. నా ఈ వచనము సత్యమని యెరుంగుము (52). వత్సా! నీవు జయమును గోరువాడవైనచో, నేను చెప్పే శుభవచనమును వినుము. నీవు శీఘ్రమే నీ బుజములతో ఆ ద్రోణ పర్వతమును సముద్రములోనికి త్రోసి వేయుము (53).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 757🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 15 🌴
🌻 The fight between the gods and Jalandhara - 6 🌻
46. In that battle, the ground shone like the dusk with clouds scattered all round, for it was strewn with elephants, horses, chariots and foot-soldiers. Some were killed and others were being killed.
47. Bhārgava resuscitated the Asuras killed in the battle with the Vidyā of Amṛtajīvinī and drops of water infused with mantras.
48. The sage Aṅgiras[5] too resuscitated the gods in the battle with the divine herbs frequently brought from the mountain Droṇa.[6]
49. Jalandhara saw the gods restored to life again in the battle. He then spoke angrily to Bhārgava.
Jalandhara said:—
50. “The gods have been killed by me. How do they rise up again? The Vidyā of Sañjīvinī[7] has not been heard by me to exist elsewhere.”
Sanatkumāra said:—
51. On hearing these words of the son of the ocean, the delighted Bhārgava, the preceptor, replied to Jalandhara.
Bhārgava said:—
52. “Aṅgiras is bringing divine herbs from the mountain Droṇa and enlivening the gods. O dear, know my words to be true.
53. O dear, if you wish for victory listen to my auspicious suggestion. Immediately you shall uproot the mountain Droṇa with your arms and hurl it into the ocean.”
Continues....
🌹🌹🌹🌹🌹
Comments