🌹 . శ్రీ శివ మహా పురాణము - 758 / Sri Siva Maha Purana - 758 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 15 🌴
🌻. దేవజలంధర సంగ్రామము - 7 🌻
సనత్కుమారుడిట్లు పలికెను - గురువగు భార్గవుడిట్లు చెప్పగా, ఆ రాక్షసరాజు వెను వెంటనే ఆ గొప్ప పర్వతము ఉన్న స్థలమునకు వచ్చెను (54). ఆ రాక్షసుడు తన భుజములతో ఆ పర్వతమునువేగముగా లాగుకొనిపోయి వెంటనే సముద్రములో పారవైచెను. శివుని తేజస్సునుండి పుట్టిన వ్యక్తి ఇట్టి పనిని చేయుట ఆశ్చర్యము కాదు (55). మహావీరుడగు ఆ జలంధరుడు వెనుకకు మరలివచ్చి ఆ మహాసంగ్రామములో తన గొప్ప బలమును ప్రదర్శించు వాడై దేవతలను వివిధములగు అస్త్రములతో సంహరింపజొచ్చెను (56). ఇట్లు దేవతలు సంహరింపబడుటను గాంచి, దేవతలచే పూజింపబడు వాడు, గురువునగు అంగిరసుడు ద్రోణ పర్వతము వద్దకు చనెను. కాని ఆతనికి అచట ఆ పర్వతము కానరాలేదు (57). ద్రోణపర్వతము రాక్షసులచే అపహరింపబడినదని తెలియగానే బుద్ధిశాలియగు బృహస్పతి భయముతో నిండిన మనస్సు గల వాడై వచ్చి దేవతలతో నిట్లనెను (58).
గురువు ఇట్లు పలికెను - దేవతలారా! మీరందరు పారిపొండు. గొప్ప ద్రోణపర్వతము ఇప్పుడు లేదు. సముద్రపుత్రుడగు ఆ రాక్షసుడు దానిని నిశ్చితముగా నాశనము చేసి యుండును (59). జలంధరుడు మహారాక్షసుడు, రుద్రుని అంశ##చే జన్మించిన వాడు, మరియు శత్రువులనందనరినీ జయించినవాడు. ఈతనిపై విజయమును పొందుట శక్యము కాదు (60) ఓ దేవతలారా! ఈతడు జన్మించిన విధానము, ఈతని ప్రభావము నాకు తెలిసినవి. శివుని అవమాని ఇంద్రుడు చేసిన చేష్టను అంతనూ గుర్తుకు తెచ్చుకొనుడు (61).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 758🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 15 🌴
🌻 The fight between the gods and Jalandhara - 7 🌻
Sanatkumāra said:—
54. Thus addressed by his preceptor Bhārgava, the lord of the Asuras, hastened to the lofty mountain.
55. With his powerful arms, the Asura brought the mountain Droṇa and hurled it immediately into the ocean. There is nothing wonderful and mysterious in regard to the splendour of Śiva.
56. The great hero, the son of the ocean, took a vast army with him, came to the battle ground and began to kill the gods with various weapons.
57. On seeing the gods being killed Bṛhaspati went to the mountain Droṇa. Then he, the object of praise and worship by the gods, did not see the mountain there.
58. On realising that the mountain Droṇa had been removed by the Asuras, Bṛhaspati was terrified. He returned and said dejectedly.
Bṛhaspati said:—
59. “O gods, run away, all of you. There is no trace of the great mountain Droṇa. Certainly it has been destroyed by the Asura, the son of the ocean.
60. Jalandhara is a great Asura. He cannot be conquered since he is born of a part of Śiva. He will pound all the gods.
61. His power has been understood by me as he is self-born. O gods, all of you remember the act of offence to Śiva perpetrated by Indra.
Continues....
🌹🌹🌹🌹🌹
Kommentare