🌹 . శ్రీ శివ మహా పురాణము - 759 / Sri Siva Maha Purana - 759 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 15 🌴
🌻. దేవజలంధర సంగ్రామము - 8 🌻
సనత్కుమారుడిట్లు పలికెను- దేవగురువుయొక్క ఆ మాటలను వినిన దేవతలు జలమునందలి ఆశను వీడి భయముతో కంగారు పడ జొచ్చిరి (62). ఆ రాక్షసవీరుడు దేవతలను నలువైపులనుండియూ సంహరించ మొదలిడెను. ఇంద్రుడు మొదలగు దేవతలు అపుడు ధైర్యమును గోల్పోయి పది దిక్కులకు పారిపోయిరి (63). సముద్రనందనుడగు ఆ రాక్షసుడు దేదతల పలాయనమును గాంచి, శంఖధ్వనులతో భేరీధ్వనులతో జయరావములతో అమరావతిలోనికి ప్రవేశించెను (64). ఇట్లు ఆ రాక్షసడు అమరావతిని ప్రవేశంశించగా, ఇంద్రాది దేవతలు ఆ రాక్షసుని బాధలకు తాళలేక మేరుపర్వత గుహను చేరి తలదాచుకొనిరి (65). ఓ మహర్షీ! అపుడా రాక్షసుడు ఇంద్రాది దేవతల అధికారములన్నింటియందు శుంభుడు మొదలగు రాక్షస శ్రేష్ఠులను వేర్వేరుగా చక్కగా నియమించి తాను స్వయంముగా మేరుపర్వతగుహ వద్దకు వెళ్లెను (66).
శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు యుద్ధఖండలో దేవజలంధర యుద్ధ వర్ణన మనే ఇరువది అయిదవ అధ్యాయము ముగిసినది (25).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 759🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 15 🌴
🌻 The fight between the gods and Jalandhara - 8 🌻
Sanatkumāra said:—
62. On hearing these words uttered by the preceptor of the gods, they abandoned all hopes of victory. They became excessively terrified.
63. All the gods including Indra, struck by the king of the Asuras all round, lost courage and fled in all directions.
64. On seeing the gods routed, the Asura, Jalandhara, the son of the ocean, entered Amarāvatī[8] with sounds of victory from the conches and drums.
65. When the Asura entered the city, Indra and other gods entered the cavern of the golden mountain Meru and remained there. They had been extremely harrassed by the Asuras.
66. O sage, at the same time the Asura appointed Śumbha and other Asuras severally in the places of authority of Indra and others. He then went into the cavern of the golden mountain.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments