top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 760 / Sri Siva Maha Purana - 760


🌹 . శ్రీ శివ మహా పురాణము - 760 / Sri Siva Maha Purana - 760 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 16 🌴


🌻. దేవాసుర యుధ్ధము - 1 🌻


సనత్కుమారుడిట్లు పలికెను - మరల అచటకు మచ్చిన ఆ రాక్షసుని గాంచి ఇంద్రాది దేవతలందరు భయముతో వణుకుతూ శీఘ్రముగా పలాయనమును చిత్తగించిరి (1). వారందరు బ్రహ్మగారిని ముందిడు కొని వైకుంఠమునకు వెళ్లి నమస్కరించి స్తుతించిరి (2).


దేవతలిట్లు పలికిరి - ఇంద్రియములకు ప్రభువైన వాడా! హేభగవాన్‌! గొప్ప బాహువులు గలవాడా! మధువు అను రాక్షసుని సంహరించిని వాడా! దేవదేవా! ఈశ్వరా! రాక్షసుల నందరినీ నశంపజేసినవాడా! నీకు నమస్కారము (3). హే విష్ణో! సత్యవ్రతుడనే పుణ్యశీలుడగు రాజుతో గుడి ప్రలయ కాలమునందు మత్స్యరూపముతో సముద్రమునందు విహరించి వేదములను కాపాడిని నీకు నమస్కారము (4). సముద్రమును మథించుటకు దేవతలు పెద్ద యత్నమును చేయుచుండగా కూర్మరూపమును దాల్చి మందరపర్వతమును మోసిన నీకు నమస్కారము (5). హే భగవాన్‌! నాథా! యజ్ఞవరాహరూపమును దాల్చి జనులకు ఆధారమైన బూమిని శిరస్సుపై ధరించిన నీకు నమస్కారము (6).


హే ప్రభో! వామనావతారములో నీవు ఇంద్రుని సోదరుడవై బ్రహ్మణ వేషముతో రాక్షసరాజైన బలిని మోసగించి బ్రహ్మాండమునంతనూ నీ అడుగులతో వ్యాపించినవు. అట్టి నీకు నమస్కారము (7). పాపులను సంహరించు నీవు పరశురాముడవై తల్లి హితము కొరకు క్రోధముతో భూమియందు క్షత్రియులు లేకుండగా చేయుటకు ఉద్యమించితివి. అట్టి నీకు నమస్కారము (8). లోకుల మనస్సులను రంజింప చుయువాడు, మర్యాదాపురుషోత్తముడు, సీతాపతి అగు రాముని రూపమును దాల్చి రావణుని సంహరించిన నీకు నమస్కారము (9).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 760🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 16 🌴


🌻 The battle of the gods - 1 🌻



Sanatkumāra said:—


1. On seeing the Asura coming again, the gods including Indra trembled with fear. They fled together.


2. With Brahmā at the head they went to Vaikuṇṭha. All of them including Prajāpati eulogised Viṣṇu after bowing down to him.



The gods said:—


3. O Hṛṣīkeśa of long arms, O lord, O slayer of Madhu, O lord of gods, Obeisance to you, O destroyer of all Asuras.


4. O Viṣṇu, of the form of fish[1] who redeemed the Vedas through king Satyavrata, obeisance to you who sport about in the ocean of Dissolution.


5. Obeisance to you of the form of Tortoise who bore the mountain Mandara of the gods who were attempting to churn the ocean.


6. Obeisance to you O holy lord, of the form of Boar. Obeisance to you who hold the earth, the support of people. Obeisance to Viṣṇu.


7. Obeisance to you, the Dwarf. Obeisance to Viṣṇu the younger brother of Indra, the lord who deceived the king of Asuras in the guise of a Brahmin.


8. Obeisance to Paraśurāma who exterminated the Kṣattriyas, who rendered help to your mother. Obeisance to you who are angry and inimical to the evil beings.


9. Obeisance to Rama who delighted the worlds and who set the limits of decent behaviour. Obeisance to you the destroyer of Rāvaṇa and the lord of Sītā.




Continues....


🌹🌹🌹🌹🌹




1 view0 comments

コメント


bottom of page