top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 764 / Sri Siva Maha Purana - 764



🌹 . శ్రీ శివ మహా పురాణము - 764 / Sri Siva Maha Purana - 764🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 16 🌴


🌻. దేవాసుర యుధ్ధము - 5 🌻


జలంధరుడిట్లు పలికెను - ఓ రాక్షసవీరులారా! బలశాలుడు, కాని పిరికి వారునగు ఇంద్రాది దేవతలతో మీరు భయంకరమగు యుద్ధమును చేయుడు (35). లక్షమంది మౌర్యులు, వందమంది దౌర్హృదులు, కోటిమంది కాలకేయాసురులు (36). లక్షమంది కంకులు మరియు ఇతరులు తమసైన్యములతో గూడి నా ఆజ్ఞచే బయలుదేరెదరు గాక! (37).


మీరందరు వివిధ వస్త్రములను, అస్త్రములను దోడ్కొని, సంశయములను విడనాడి నిర్భయులై, పెద్దపైన్యమును వెంటబెట్టుకొని సన్నద్ధులై బయలుదేరుడు (38). ఓ శుంభనిశుంభులారా! మహావీరులగు మీరిద్దరు యుద్ధమునకు భయపడే నీచులగు దేవతలను క్షణకాలములో నాశనము చేయుడు (39).


సనత్కుమారుడిట్లు పలికెను- యుద్ధనిపుణులగు ఆ రాక్షసులందరు జలంధరునిచే ఇట్లు ఆజ్ఞాపించబడిన వారై చతురంగ సైన్యముతో గూడి యుద్ధమును చేసిరి (40). దేవదానవులు గదలతో, పదునైన బాణములతో, శూలములతో, పట్టిశములతో, తోమరాయుధములతో, గొడ్డళ్లతో, శూలములతో ఒకరినొకరు సంహరించుకొనిరి (41). హృషీకేశుని సన్నిధిచే బలమును పొందియున్న మహావీరులగు దేవతలు కూడ ఇతరములగు వివిధాయుధములతో రాక్షసులను సంహరించిరి (42). దేవదానవులు సింహనాదములను చేస్తూ వాడి బాణములను ప్రయోగిస్తూ, మరియు రోకళ్లతో తోమరాయుధములతో యుద్దమును చేసిరి (43). ఈ తీరున దేవదానవులకు గొప్ప సంగ్రామము జరిగెను. అత్యుగ్రమగు ఆ యుద్దము మునులకు సిద్ధులకు భయమును కలిగించెను (44).


శ్రీ శివమహాపురాణములోరుద్రసంహితయందలి యుద్ధఖండలో దేవాసురయుద్ధ వర్ణన మనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 764🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 16 🌴



🌻 The battle of the gods - 5 🌻


Jalandhara said:—


35. O Excellent Asuras, put up a stiff fight with Indra and other gods who are always cowardly though they have a huge army.


36-37. At my bidding let all these come out with their entire army—the Mauryas numbering a hundred thousand, the Dhūmras in hundreds, the Asuras and the Kālakeyas in crores and the Kālakas, the Daurhṛdas and the Kaṅkas in lakhs.


38. All of you come out readily equipped with many divisions of the army and different kinds of weapons. Be fearless and free from hesitations.


39. O Śumbha, O Niśumbha, destroy in a trice the insignificant gods who feel nervous in the battle field. You are extremely valorous.



Sanatkumāra said:—


40-41. Thus the Asuras clever and efficient in battle, commanded by Jalandhara on the one hand and gods equipped with the four sorts of fighting groups on the other fought one another with maces, arrows, javelins, spears etc. They hit one another with axes and spears.


42. The strong ones hit and struck with different weapons. The heroic gods supported and invigorated by Hṛṣīkeśa roared like lions and discharged sharp arrows.


43. Some fought with arrows of very sharp points; some with pestles and iron clubs and some with axes and spears.


44. Thus the fight between the gods and the Asuras was terrific. It was very fierce frightening the sages and the Siddhas.



Continues....


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Comentarios


bottom of page