top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 766 / Sri Siva Maha Purana - 766


🌹 . శ్రీ శివ మహా పురాణము - 766 / Sri Siva Maha Purana - 766🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 17 🌴


🌻. విష్ణు జలంధర యుద్ధము - 2 / The fight between Viṣṇu and Jalandhara - 2 🌻


అపుడు గరుడుని రెక్కల వేగమునుండి పుట్టిన గాలిచే పీడను పొందిన రాక్షసుల తుఫాను లో మేఘములవలె ఆకాశములో పల్టీలు కొట్టిరి (8). అపుడు మహారాక్షసుడు, దేవతల సమూహములకు భయమును గొల్పువాడు అగు జలందరుడు పెనుగాలిచే దుఃఖితులగుచున్న రాక్షసులను చూసి మిక్కిలి కోపించెను (9). రాక్షసులను సంహరించుచున్న విష్ణువును గాంచి కోపముతో వణకుచున్న అధరము గల వీరుడగు జలంధరుడు విష్ణువుతో యుద్ధమును చేయుట కొరకై ముందునకురికెను (10).


ఆ రాక్షసేశ్వరుడు దేవతలకు, రాక్షసులకు కూడా భయమును గొల్పు గొప్ప నాదమును చేసెను. దానిని విన్న వారి చెవులు పగిలినవి(11). జలంధరాసురుని భయంకరమగు గొప్ప నాదముచే నిండిపోయిన జగత్తు అంతయు ఆ సమయములో కంపించెను (12). అపుడు విష్ణువునకు, ఆ రక్షసరాజునకు మధ్య గొప్ప యుద్ధము జరిగెను. వారు ఆకాశమునంతనూ లేశ##మైననూ అవకాశము లేని విధముగా బాణములతో నింపి వేసిరి (13). ఓ మహర్షీ! వారి ద్వంద్వయుద్ధమును గాంచిన దేవతలు, రాక్షసులు, మహర్షులు, సిద్ధులు సరమాశ్చర్యమును పొందిరి (14).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 766🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 17 🌴


🌻 The fight between Viṣṇu and Jalandhara - 2 🌻


8. Then the Asuras afflicted by the gusts of wind set in motion by the wings of Garuḍa in his speedy flight were blown to and fro like the clouds in the sky tossed about in a stormy whirlwind.


9. On seeing the Asuras afflicted by the gusts of wind Jalandhara the great Asura became furious and terrified all the gods.


10. Seeing Viṣṇu suppressing and pounding the Asuras, the lips of the heroic Asura throbbed and he rushed at Viṣṇu to fight with him.


11. The king of Asuras shouted and roared terrifying both the gods and the Asuras. On hearing it, the ears became pierced.


12. The entire universe, filled with the terrible shouts of the Asura Jalandhara, quaked.


13. Then a great battle ensued between Viṣṇu and Jalandhara, the ruler of Asuras, both filling up the sky with their arrows.


14. O sage, gods, Asuras, sages and the Siddhas were very much surprised at the terrible mutual clash between the two.



Continues....


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Comentarios


bottom of page