🌹 . శ్రీ శివ మహా పురాణము - 768 / Sri Siva Maha Purana - 768🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 17 🌴
🌻. విష్ణు జలంధర యుద్ధము - 4 🌻
మహాబలుడగు జలంధరుడు కోపముతో వణుకుచున్న వాడై ధనస్సు నందు మరల బానములను సంధించగా, విష్ణువు దానిని కూడ విరుగగొట్టెను (22). వాసుదేవుడు దేవశత్రువగు జలంధరుని సంహరించ గోరి కోపముతో మరల బాణమును ధనస్సు నందు సంధించి సింహనాదమును చేసెను (23). రాక్షసరాజు, బలశాలి యగు జలంధరు అపుడు కోపముతో పెదవిని కొరికి తన బానముతో విష్ణువు యొక్క శార్‌ఙ్గథనస్సును విరుగగొట్టెను (24). భయంకరమగు పరాక్రమము గలవాడు, మహావీరుడు, దేవతలకు భయమును గొల్పువాడు నగు జలంధరుడు మరల మధుసూదనుని మిక్కిలి వాడియగు బాణముతో కొట్టెను (25).
లోకములను రక్షించే కేశవభగవానుడు విరిగిన ధనస్సు గలవాడై జలంధరుని సంహరించుటకై దివ్యమగు గదను ప్రయోగించెను (26). మండే అగ్నిని బోలియున్నది, అమోఘమగు గతి కలది అగు ఆ గద విష్ణువచే ప్రయోగింపబడి వెంటనే అతని దేహమునకు తగిలెను (27). బలముతో గర్వించినవాడు, మహారాక్షసుడునగు జలంధరునకు ఆ గత పుష్పమాలవలె తగిలి, లేశమైననూ అతనిని కదిలించలేక పోయెను (28). యుద్ధములో సహింప శక్యము కాని పరాక్రమము గలవాడు, దేవతలకు భయమును గొల్పువాడునగు జలంధరుడు అపుడు కోపించి అగ్నిహోత్రమువలె మిరుమిట్లు గొల్పు చున్న త్రిశూలమును విష్ణువు పైకి విసిరెను (29).
అపుడు విష్ణువు శివుని పాదపద్మములను స్మరించి వెంటనే నందకమను ఖడ్గముతో ఆ త్రిశూలమును ముక్కలు చేసెను (30). త్రిశూలము ముక్కలు కాగానే, ఆ రాక్షసవీరుడు వెంటనే పైకి దుమికి వచ్చి విష్ణువును బలమగు పిడికిలతో వక్షస్థలముపై కొట్టెను (31). మహావీరుడగు ఆ విష్ణువు కూడా ఆ బాధను లెక్కచేయక, బలమగు పిడికిలితో జలంధరుని వక్షస్థ్సలముపై కొట్టెను (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 768🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 17 🌴
🌻 The fight between Viṣṇu and Jalandhara - 4 🌻
22. The infuriated great Asura fixed an arrow again to his bow and split the arrow of Viṣṇu.
23. Vāsudeva fixed another arrow to his bow for the destruction of the enemy of the gods angrily and roared like a lion.
24. Biting his lips with anger, Jalandhara the powerful king of Asuras split the bow of Viṣṇu with his arrow.
25. The heroic Asura of fierce valour, terrible to the gods, hit Viṣṇu again with very sharp arrows.
26. With his bow split, the lord Viṣṇu, protector of the worlds, hurled his great mace for the destruction of Jalandhara.
27. That mace resembling a blazing flame when hurled by Viṣṇu moved with unerring aim and dashed against his body.
28. Though hit by it, the great haughty Jalandhara did not move even slightly as though he was hit by a flower-garland.
29. Then the infuriated Jalandhara, invincible in war, terrifying to the Asuras hurled a trident, resembling fire, at Viṣṇu.
30. Immediately Viṣṇu remembered the lotus-like feet of Śiva and cut the trident with his sword Nandaka.
31. When the trident was split, the lord of the Asuras leapt and rushed against Viṣṇu and hit him in the chest with his fist.
32. Without minding the pain in the least, the heroic Viṣṇu hit Jalandhara in the chest with his firm fist.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments