top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 770 / Sri Siva Maha Purana - 770


🌹 . శ్రీ శివ మహా పురాణము - 770 / Sri Siva Maha Purana - 770🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 17 🌴


🌻. విష్ణు జలంధర యుద్ధము - 6 🌻


సనత్కుమారుడిట్లు పలికెను- ఆ మహారాక్షసుని ఈ మాటను విని దేవదేవుడు, పాపహారియగు విష్ణుభగవానుడు భేదముతో నిండిన మనస్సు గలవాడై 'అటులనే యగుగాక!' అని పలికెను (42). తరువాత విష్ణువు దేవగణములందరితో, మరియు లక్ష్మీదేవితో గూడి జలంధరమను నగరమునకు వచ్చి నివసించెను (43). అపుడు ఆ జలంధరాసురుడు తన సోదరియగు లక్ష్మితో మరియు విష్ణువుతో గూడి తన ఇంటికి చేరి ఆనందముతో నిండిన మనస్సు గలవాడై నివసించెను (44). అపుడు జలంధరుడు దేవతల అధికారపదవులలో రాక్షసులను నియమించి ఆనందముతో భూమండలమునకు మరలి వచ్చెను (45). సముద్రతనయుడగు జలంధరుడగు దేవగంధర్వ సిద్ధుల వద్ద గల శ్రేష్ఠవస్తువుల నన్నిటినీ స్వాధీనమొనర్చు కొనెను (46). బలవంతుడగు జలంధరుడు పాతాళభవనమునందు మిక్కిలి బలశాలియగు నిశుంభుని స్థాపించి, శేషుడు మొదలగు వారిని భూమండలమునకు తీసుకువచ్చెను (47).


ఆతడు దేవ గంధర్వ సిద్ధ సమూహములను, నాగరాక్షసమనుష్యులను తన నగరములో పౌరులుగా చేసుకొని ముల్లోకములను శాసించెను (48). జలంధరుడు ఈ తీరున దేవతలను తన వశము చేసుకొని, ప్రజలను స్వంతబిడ్డలను వలె రక్షించి, ధర్మబద్ధముగా రాజ్యము నేలెను (49). ఆతడు ధర్మముతో రాజ్యము నేలుచుండగా, రాజ్యములో వ్యాధిగ్రస్తులుగాని, దుఃఖితులు గాని, క్రుంగి కృశించినవారు గాని, దీనులు గాని ఒక్కడైననూ కానరాలేదు (50).


శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందు యుద్ధఖండలో విష్ణు జలంధర యుద్ధ వర్ణనమనే పదునేడవ అధ్యాయము ముగిసినది (17).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 770🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 17 🌴


🌻 The fight between Viṣṇu and Jalandhara - 6 🌻



Sanatkumāra said:—


42. On hearing these words of the great Asura, lord Viṣṇu, the lord of gods, said distressingly—“So be it.”


43. Then Viṣṇu came to the city called Jalandhara[1] along with his followers, the gods and Lakṣmī.


44. Then the Asura Jalandhara returned to his abode and stayed very delightedly in the company of his sister and Viṣṇu.


45. Thereafter Jalandhara appointed Asuras in the authoritative posts of the gods. Joyously he returned to the Earth.


46. The son of the ocean confiscated whatever gem or jewel the gods, Gandharvas or Siddhas had hoarded.


47. After appointing the powerful Asura, Niśumbha, in the nether-worlds, the powerful ruler of the Asuras brought Śeṣa and others to the Earth.


48. Making gods, Gandharvas, Siddhas, Serpents, Rākṣasas and human beings, the denizens of his capital, he ruled over the three worlds.


49. After making the gods thus subservient to himself, Jalandhara protected them all virtuously, like his own sons.


50. When he was ruling the kingdom virtuously, none in his realm was sick or miserable or lean and emaciated or indigent.



Continues....


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Comments


bottom of page