🌹 . శ్రీ శివ మహా పురాణము - 771 / Sri Siva Maha Purana - 771🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 18 🌴
🌻. నారద జలంధర సంవాదము - 1 / The conversation between Nārada and Jalandhara - 1 🌻
సనత్కుమారుడిట్లు పలికెను - ఓ మహర్షీ! ఆ మహాసురుడు ఈ తీరున భూమిని ధర్మబద్ధముగా పాలించుచుండగా, జ్ఞాతులగుటచే దేవతలు దుఃఖితులైరి (1). దుఃఖితులై యున్న ఆ దేవతలందరు మంగళకరుడు, దేవదేవుడు, సర్వసమర్థుడు అగు శివప్రభుని మనస్సులో శరణు పొందిరి (2). భక్తిప్రియుడు, సర్వమునిచ్చు వాడునగు మహేశ్వరభగవానుని వారు తమ దుఃఖములు తొలగుట కొరకై అభీష్టములగు వచనములతో స్తుతించిరి (3). భక్తుల కోర్కెలనన్నిటినీ ఈడేర్చు ఈ మహాదేవుడు దేవకార్యమును చేయగోరి నారదుని పిలిపించి ప్రేరేపించెను (4).
అపుడు దేవర్షి, జ్ఞాని, శివభక్తుడు, సత్పురుషులకు శరణ్యుడు అగు ఆ నారదుడు శివుని ఆజ్ఞచే జలంధరుని నగరములో నున్న దేవతల వద్దకు వెళ్లెను (5). దుఃఖితులై యున్న ఆ ఇంద్రాది దేవతలందరు నారదముని వచ్చుచుండుటను గాంచి వెంటనే లేచి నిలబడిరి (6). ఆదుర్దా ముఖమునందు వ్యక్తమగు చుండగా ఇంద్రాది దేవతలు నారదమహర్షికి ప్రీతిపూర్వకముగా నమస్కరించి ఆసనమునిచ్చిరి (7). దీనులగు ఇంద్రాది దేవతలు ఆసనమునందు ఉపవిష్టుడైన ఆ నారదమహర్షికి మరల నమస్కరించి ఇట్లు పలికిరి (8).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 771🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 18 🌴
🌻 The conversation between Nārada and Jalandhara - 1 🌻
Sanatkumāra said:—
1. When the great Asura was ruling over the Earth virtuously, the gods were reduced to be mere slaves, O great sage.
2. The distressed gods mentally sought refuge in Śiva the benefactor, lord of gods and of everyone.
3. They eulogised the great lord, the bestower of everything and favourably disposed to his devotees, by means of pleasant words.
4. The great lord, the bestower of all desires to his devotees called Nārada and commissioned him with a desire to carry out the task of the gods.
5. Then the celestial sage, the wise devotee of Śiva, the goal of the good, went to the gods in the city of the Asuras at the bidding of Śiva.
6. On seeing the sage Nārada coming, the distressed gods, Indra and others, stood up.
7. After bowing to the sage, Indra and other gods, their anxiety apparently manifest in their faces, offered a seat to Nārada.
8. After bowing to Nārada the great sage who sat comfortably, the distressed gods, Indra and others spoke to him again.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments