top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 774 / Sri Siva Maha Purana - 774


🌹 . శ్రీ శివ మహా పురాణము - 774 / Sri Siva Maha Purana - 774 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 18 🌴


🌻. నారద జలంధర సంవాదము - 4 🌻


చింతామణుల ప్రకాశముతో నలరారు కైలాసమునందు వందలాది కామధేనువులు గలవు. దివ్యమగు కైలాసశిఖరము పూర్తిగా స్వర్ణమయము. అచట అంతటా అద్భుతములు శోభను గూర్చును (27). అచట సర్వావయవసుందరుడు, పచ్చనివాడు, ముక్కంటి, చంద్రుని శిరముపై దాల్చినవాడు అగు శంకరుడు పార్వతితో గూడి ఉపవిష్టుడై యుండగా చూచితిని (28). ఆ గొప్ప అద్భుతదృశ్యమును చూచిన నాకు అపుడు మనస్సులో ఒక సందేహము కలిగెను. ఇట్టి సంపద ముల్లోకములో ఎక్కడనైననూ ఉన్నదా? లేదా? (29) ఓ రాక్షసరాజా! అంతలో నాకు నీ సంపద గుర్తుకు వచ్చినది. అందువలననే, నీ సంపదను చూచుటకై ఇచటకు నీ సన్నిధికి వచ్చియుంటిని (30).


సనత్కుమారుడిట్లు పలికెను- నారదుని ఈ మాటను విని రాక్షసరాజగు ఆ జలంధరుడు ఆదరముతో తన పూర్ణసంపదను చూపించెను (31). జ్ఞాని, దేవతల కార్యమును చక్కబెట్టువాడు అగు ఆ నారదుడు ఆ సంపదను చూచి శంకరుని ప్రేరణను పొంది, రాక్షసరాజగు ఆ జలంధరునితో నిట్లనెను (32).


నారదుడిట్లు పలికెను- ఓ గొప్ప వీరుడా! నీకు గొప్ప సంపద గలదు. నీవు ముల్లోకములకు ప్రభుడవు. దీనిలో ఆశ్చర్యమేమున్నది? (33). మణులు, రత్నములు నీవద్ద గుట్టలుగా గలవు. గజాది సమృద్ధులు కూడ నీకు గలవు. మరియు శ్రేష్ఠవస్తువులన్నియు ఈనాడు నీ ఇంటిలో విరాజిల్లుచున్నవి (34).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 774🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 18 🌴


🌻 The conversation between Nārada and Jalandhara - 4 🌻


27. Hundreds of Kāmadhenus are found there. It is illuminated by Cintāmaṇi gems. It abounds in gold. It is divine and wonderfully brilliant.


28. There I saw Śiva seated along with Pārvatī. He is fair-complexioned and exquisitely handsome. He has three eyes and the moon for his crest.


29. On seeing this wonderfully great thing, a doubt arose in my mind. Can there be anywhere in the three worlds such a splendour as this?”


30. O lord of Daityas then the idea of your prosperity struck into my mind. Now I have come to you to see it personally.



Sanatkumāra said:—


31. On hearing these words of Nārada the lord of Daityas Jalandhara showed all his glory to Nārada.


32. On seeing it, the wise Nārada, eager to realise the interests of the gods, spoke to the king of Daityas, Jalandhara, induced by the lord.



Nārada said:—


33. O foremost among heroes, you have everything conducive to prosperity. You are the lord of the three worlds. What wonder that you possess this wealth.


34. Big jewels, heaps of gems, elephants and other adjuncts to prosperity flourish in your mansion. Whatever valuable thing there is in the worlds finds a place here.



Continues....


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Commentaires


bottom of page