top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 777 / Sri Siva Maha Purana - 777


🌹 . శ్రీ శివ మహా పురాణము - 777 / Sri Siva Maha Purana - 777 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 19 🌴


🌻. దూత సంవాదము - 1 🌻


వ్యాసుడిట్లు పలికెను- ఓ సనత్కుమారా! నీవు సర్వజ్ఞుడవు. నారదుడు ఆకాశమార్గములో నిర్గమించిన పిదప, ఆ రాక్షసరాజు ఏమి చేసెను? వివరముగా చెప్పుము (1).


సనత్కుమారుడిట్లు పలికెను- నారదుడు సెలవు తీసుకొని ఆకాశమార్గములో నిర్గమించిన పిదప ఆ రాక్షసుడు ఆమెయొక్క రూపమును గూర్చి వినియుండుట వలన మన్మథ జ్వరముయొక్క పీడకు గురి ఆయెను (2). బుద్ధి నశించి, మోహమునకు వశుడై మృత్యువునకు ఆధీనుడై జలంధరాసురుడు అపుడు రాహువును దూతగా పంపుటకై పిలిపించెను (3). సముద్ర తనయుడగు జలంధరుడు కామనచే ఆక్రమింపబడిన మనస్సు గలవాడై తన వద్దకు వచ్చిన రాహువును గాంచి చక్కగా సంబోధించి ఇట్లు వివరించెను (4).


జలంధరుడిట్లు పలికెను- ఓయీ రాహూ! నీవు దూతలందరిలో శ్రేష్ఠుడవు. నీవు కార్యముల నన్నిటినీ చక్కబెట్టగలవు. ఓయీ మహాబుద్ధిశాలీ! కైలాస పర్వతమునకు వెళ్లుము (5). అచట తపశ్శాలి, జటలను ధరించువాడు, భస్మతో అలంకరింపబడిన సర్వావయవములు గలవాడు, విరాగి, ఇంద్రియములను జయించినవాడు అగు శంభుయోగి గలడు (6). ఓయీ దూతా! నీవు అచటకు వెళ్లి, జటాధారి, వైరాగ్యసంపన్నుడు అగు శంకరయోగితో నిర్భయమగు హృదయముతో నిట్లు చెప్పుము (7). ఓయీ యోగీ! దయానిధీ! భూత ప్రేతపిశాచాదులతో సేవింపబడే వనవాసివగు నీకు భార్యారత్నముతో పని యేమి? (8) ఓ యోగీ! నేను భువనమునకు ప్రభువునై యుండగా ఇట్టి పరిస్థితి ఉచితము కాదు. కావున నీవు శ్రేష్ఠవస్తువులకు భోక్తనగు నాకు నీ భార్యారత్నమునిమ్ము (9). ముల్లోకములలోని శ్రేష్ఠ సుందరవస్తువులన్నియు నా వద్ద గలవు. స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తు అంతయు నా ఆధీనములో నున్నదని యెరుంగుము (10). ఏనుగులలో గొప్పది యగు ఇంద్రుని ఐరావతమును, ఉత్తమమగు ఉచ్చైశ్శ్రవసమనే గుర్రమును, మరియు పారిజాత వృక్షమును నేను శీఘ్రమే బలాత్కారముగా లాగుకొంటిని (11).




సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 777🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 19 🌴


🌻 Jalandhara’s emissary to Śiva - 1 🌻



Vyāsa said:—


1. O omniscient Sanatkumāra, what did the king of Daityas do after the departure of Nārada to heaven? Please narrate to me in detail.



Sanatkumāra said:—


2. When Nārada departed to heaven after taking leave of the Daitya, the king of Daityas who had heard of the exquisite beauty of Pārvatī became harassed with pangs of love.


3. The deluded Daitya, Jalandhara, who had lost clear thinking, being swayed by Time (the annihilator) called his messenger Rāhu.


4. The infatuated son of the ocean, Jalandhara, addressed him politely with these words.



Jalandhara said:—


5. O Rāhu of great intellect, most excellent of my emissaries, go to the mountain Kailāsa, O accomplisher of all activities.


6. A sage and a Yogin named Śiva lives there. He has matted locks of hair. He is detached. He has controlled his senses. His body is smeared with ashes.


7. O messenger, you shall go there and tell the detached Yogin Śiva with matted locks of hair, fearlessly.


8. ‘O Yogin, ocean of mercy, of what avail is an exquisitely beautiful wife to you who stay in the jungle attended by ghosts, goblins, spirits and other beings?


9. O Yogin, this state of affairs is no good in a world with me as the Ruler. Hence you give up your wife, the most excellent lady, to me, the enjoyer of all excellent things.


10. Know that the whole universe including the mobile and immobile beings is under my suzerainty. All the excellent things of the three worlds have come into my possession.


11. I have forcibly seized the most excellent elephant of Indra, the most excellent horse, Uccaiḥśravas and the celestial tree pārijāta.




Continues....


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Comments


bottom of page