top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 778 / Sri Siva Maha Purana - 778


🌹 . శ్రీ శివ మహా పురాణము - 778 / Sri Siva Maha Purana - 778 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 19 🌴


🌻. దూత సంవాదము - 2 🌻

హంసలు పూన్చినది, విమానములలో శ్రేష్ఠమైనది, మహాదివ్యమైనది, ఉత్తమమైనది, అద్భుతమైనది అగు బ్రహ్మగారి విమానము నా వాకిట నిలబడియున్నది (12). మహాపద్మము మొదలగు కుబేరుని గొప్ప నిధులన్నియు నా ఇంటిలో నున్నవి. వరుణుని ఛత్రము బంగరు కాంతులను వెదజల్లుతూ నా ఇంటియందు గలదు (13). ఎన్నటికీ వాడని పద్మముల కేసరములతో శోభిల్లు గొప్ప మాల నావద్ద గలదు. నా తండ్రి, జలాధిపతి యగు వరుణుని పాశము కూడ నా వద్ద గలదు (14). ప్రాణులకు మరణము నొసంగు గొప్ప శక్తిని నేను యముని వద్దనుండి బలాత్కారముగా లాగు కొంటిని. అగ్ని నాకు శుద్ధమైన రెండు దివ్యవస్త్రముల నిచ్చినాడు (15). ఓ యోగిశ్రేష్ఠా! ఈ తీరున శ్రేష్ఠవస్తువులన్ని యు నావద్ద విలసిల్లుచున్నవి. ఓ జటాధారీ! కావున నీవు కూడ స్త్రీరత్నమగు నీ భార్యను నాకు ఇమ్ము (16). సనత్కుమారుడిట్లు పలికెను- రాహువు ఈ జలంధరుని మాటలను విని అచటకు వెళ్లెను. నంది ఆయనను శివుని సభలో ప్రవేశ##పెట్టెను. ఆతడు ఆశ్చర్యముతో విప్పారిన నేత్రములతో ఆ అద్భుతమగు సభను గాంచెను (17). అచటకు వెళ్లి దేవదేవుడు, మహాప్రభుడు, తన తేజస్సుచే చీకట్లను నశింపజేయు చున్నవాడు, విభూతి లేపనముచే ప్రకాశించువాడు (18). మహారాజునకు ఈయబడే పరిచర్యలతో మహాద్భుతముగా ప్రకాశించుచున్నవాడు, సర్వావయవములయందు సుందరుడు, దివ్యములగు భూషణములచే అలంకరింపబడినవాడు, పాపహారియగు శివుని ప్రత్యక్షముగా గాంచి (19). ఆయనకు నమస్కరించెను. ఆయన తేజస్సుచే వ్యాప్తమైన దేహము గలవాడు, రాహువు అను పేరు గలవాడు అగు ఆ దూత గర్వముతో శివుని సమీపమునకు వెళ్లెను (20). ఆయనతో మాటలాడగోరి సింహికాపుత్రుడగు రాహువు ఆయన ఎదుట గూర్చుండెను. అపుడాతడు సంజ్ఞచే ప్రేరితుడై ముక్కంటి దైవముతో నిట్లనెను (21). సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 SRI SIVA MAHA PURANA - 778🌹 ✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj 🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 19 🌴 🌻 Jalandhara’s emissary to Śiva - 2 🌻 12. The wonderfully excellent and the most divine aerial chariot fitted with the swan, belonging to Brahmā is now standing in my court-yard. 13. The divine and excellent treasure Mahāpadma etc. of Kubera is in my custody. The umbrella of Varuṇa stands in my house shedding its golden brilliance. 14. The great garland of never-fading lotuses of fine filaments belonging to my father is as good as mine. The noose of Varuṇa lord of waters is also mine. 15. The excellent Javelin of Mṛtyu has been seized by me with force. The god of fire has surrendered to me two clothes purified in fire. 16. Thus, O great Yogin, all excellent things shine in my possession. Hence O ascetic (wearing matted hair) you too surrender your wife the most excellent of all ladies to me.[1] Sanatkumāra said:— 17. On hearing his words Rāhu went to Kailāsa and was allowed to enter by Nandin. With surprise and mystery manifest in his eyes, he went to the assembly chamber of Śiva. 18-20. On entering it, he saw Śiva, the lord of the gods, the great lord, quelling darkness with his refulgence, shining with ashes smeared (over his body), adorned with all Royal paraphernalia, of wonderful features, exquisite in every limb and embellished with divine ornaments. The emissary named Rāhu bowed to Śiva. His haughtiness subsided by the brilliance of his body. He went near Śiva. 21. Rāhu was desirous of speaking to him. He sat in front of Śiva. Urged by his gesture Rāhu spoke to the three-eyed god Śiva. Continues.... 🌹🌹🌹🌹🌹



1 view0 comments

Comments


bottom of page