🌹 . శ్రీ శివ మహా పురాణము - 779 / Sri Siva Maha Purana - 779 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 19 🌴
🌻. దూత సంవాదము - 3 🌻
రాహువు ఇట్లు పలికెను- దైత్యులచే నాగులచే సేవింపబడు వాడు, సర్వదా ముల్లోకములకు అధిపతి యగు ఆ జలంధరునిచే పంపబడినవాడనై దూతనగు నేను నీ వద్దకు వచ్చి యుంటిని (22). సముద్రుని కుమారుడు, దితిపుత్రులందరికీ ప్రభువు అగు జలంధరుడు తరువాతి కాలములో సర్వులకు అధినాయకుడై ముల్లోకములకు ప్రభువైనాడు (23). బలవంతుడు, దేవతలకు మృత్యువుతో సమమైనవాడు అగు ఆ రాక్షసరాజు యోగివి అగు నిన్ను ఉద్దేశించి పలికిన పలుకులను వినుము (24). ఓ వృషభధ్వజా! గొప్ప దివ్యమైన ప్రభావము గలవాడు, రాక్షసాధిపతి, సర్వశ్రేష్ఠవస్తువులకు యజమాని అగు ఆ రాక్షసప్రభుని ఆజ్ఞను నీవు వినుము (25). శ్మశానమునందు నివసించువాడవు, నిత్యము ఎముకల మాలను ధరించు వాడవు, మరియు దిగంబరుడవు అగు నీకు శుభకరురాలు అగు హిమవత్పుత్రి భార్య ఎట్లు అయినది? (26) నేను రత్నములకు అధీశ్వరుడను. ఆమె స్త్రీలలో శ్రేష్ఠురాలు. కావున ఆమె నాకు మాత్రమే యోగ్యురాలగును. భిక్షకుడవగు నీకు ఆమె తగదు (27). నాకు ముల్లోకములు వశములో నున్నవి. నేను యజ్ఞభాగములను భుజించి చున్నాను. ఈ ముల్లోకములలోని శ్రేష్ఠవస్తువు లన్నియు నా ఇంటిలో నున్నవి (28). మేము శ్రేష్ఠవస్తువులను అనుభవించే రారాజులము. నీ వైతే యోగివి, దిగంబరుడవు. నీవద్దనున్న స్త్రీరత్నమును నాకు సమర్పించుము. ప్రజలు రాజునకు సుఖమును కలిగించవలెను గదా! (29)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 779🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 19 🌴
🌻 Jalandhara’s emissary to Śiva - 3 🌻
Rāhu said:—
22. I am the messenger of the lord of the three worlds, worthy of being served for ever by Daityas and serpents. I have come here to you on being sent by him.
2 3. The son of the ocean Jalandhara became the lord of all Daityas and now he is the lord of the three worlds. He is the emperor of all.
24. That powerful king of Daityas is like the god of death to the gods. Listen to what he says addressing you the Yogin.
25. O bull-bannered god, listen to the behest of the lord of Daityas who has divine power and who is the master of all excellent things.
26. How can the auspicious daughter of Himavat be a wife unto you who habitually stay in the cremation ground wearing garlands of bones and assuming the form of a naked ascetic.
27. I am the possessor of all excellent things. She is the most excellent of all ladies. She deserves me better than you who live on alms.
28. The three worlds are under my control. I partake of shares in sacrifices. The excellent things of the three worlds are found in my palace.
29. We are the enjoyers of excellent things. You are a mere naked ascetic and a Yogin. Surrender your wife unto me. Subjects shall always keep their king happy.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments