🌹 . శ్రీ శివ మహా పురాణము - 782 / Sri Siva Maha Purana - 782 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 19 🌴
🌻. దూత సంవాదము - 6 🌻
సనత్కుమారుడిట్లు పలికెను- ఆ పురుషుడు శివునిచే ఇట్లు ఆజ్ఞాపించబడిన వాడై తన కాళ్లుచేతుల లోని మాంసమును భక్షించెను. శిరస్సు మాత్రమే మిగిలి యుండెను (45). శిరస్సు మాత్రమే మిగిలి యుండుటను గాంచి సదాశివుడు మిక్కిలి ప్రసన్నుడై భయంకరమగు కర్మను ఆచరించిన ఆ పురుషునితో విస్మయపూర్వకముగా నిట్లనెను (46).
శివుడిట్లు పలికెను- ఓయీ మహాగణా! నా ఆజ్ఞను పాలించు నీవు ధన్యుడవు. ఓయీ శ్రేష్ఠపురుషా! నీ ఈ కర్మను గాంచి నేను మిక్కిలి సంతసించితిని (47). సర్వదా నా కుమారుడవు, మహాగణుడవు, మహావీరుడవు, దుష్టులందరికీ భయమును గొల్పువాడవు అగు నీవు కీర్తిముఖుడను పేరును గాంచుము (48). నన్ను పూజించు నా భక్తులు నాకు ప్రియుడవగు నిన్ను కూడ సర్వదా పూజించెదరు. నిన్ను పూజించని వారు నాకు ఎన్నటికి ప్రీతి పాత్రులు కాజాలరు (49).
సనత్కుమారుడిట్లు పలికెను- శివుని నుండి ఇట్టి వరమును పొంది ఆ పురుషుడు మిక్కిలి సంతసిల్లెను. అప్పటి నుండియు కీర్తిముఖుడు దేవదేవుని ద్వారము వద్ద నిలబడి యున్నాడు (50). శివుని పూజించువారు ఆ గణుని శ్రద్ధతో పూజించవలెను. ఎవరైతే ముందుగా ఆతనిని పూజించరో, వారి పూజ వ్యర్థమగును.
శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందు యుద్ధఖండములో దూతసంవాదమనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 782🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 19 🌴
🌻 Jalandhara’s emissary to Śiva - 6 🌻
Anatkumāra said:—
45. On being commanded thus by Śiva, the being ate up the flesh from his limbs. He was then left only with his head.
46. On seeing that being of terrible activities, left only with his head, the delighted Sadāśiva spoke smilingly.
Śiva said:—
47. “O great Gaṇa, you are blessed since you carried out my behest to the very letter. O excellent one, I am pleased with this action of yours.
48. You shall hereafter be known by the title Kīrtimukha. You shall be my door-keeper. You shall be one of my great Gaṇas, very heroic and terrible to all wicked persons.
49. You are my favourite. In the course of my worship, you too shall be worshipped always by my devotees. Those who do not worship you cannot be pleasing to me.”
Sanatkumāra said:—
50. With this excellent blessing from Śiva, he became delighted. From that time onwards Kīrtimukha[2] was stationed at the entrance of the lord of the gods.
51. This Gaṇa shall be specially worshipped in the course of the adoration of Śiva. Those who do not worship him at the outset will find their worship in vain.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments