🌹 . శ్రీ శివ మహా పురాణము - 783 / Sri Siva Maha Purana - 783 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 20 🌴
🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 1 🌻
వ్యాసుడిట్లు పలికెను- ఓ సనత్కుమారా! సర్వజ్ఞుడవగు నీవు శంకరమహాప్రభుని అద్భుతగాథను వినిపించితివి. ఈ గాథలోని లీల పావనము (1). ఓ మహర్షీ! నీవిపుడు నాపై దయను చూపి, ఆ పురుషునిచే విడిచిపెట్టబడిన రాహువు ఎచటకు వెళ్లెను? అను విషయమును మిక్కలి ప్రీతితో చెప్పుము (2).
సూతుడిట్లు పలికెను- మహాబుద్ధి మంతుడగు ఆ వ్యాసుని ఈ మాటను విని బ్రహ్మపుత్రుడగు ఆ మహర్షి ప్రసన్మగు మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను (3).
సనత్కుమారుడిట్లు పలికెను- ఆ పురుషుడు రాహువును అభీరదేశములో విడిచి పెట్టుటచే, రాహువు జాతి బాహ్యుడై, భూలోకములో అట్టి ప్రఖ్యాతిని గాంచినాడు (4). తరువాత ఆతడు తనకు పునర్జన్మ లభించినదని భావించి తలవంచుకొని తొలగిన గర్వము గలవాడై మెల్లగా జలంధరుని నగరమును చేరెను (5). ఓ వ్యాసా! ఆతడు జలంధరుని వద్దకు వెళ్లి ఈశ్వరుని వ్యవహారము నంత నూ ఆ రాక్షసరాజునకు సంగ్రహముగా చెప్పెను (6). సముద్రపుత్రుడు, రాక్షసవీరులలో శ్రేష్ఠుడు, బలవంతుడు అగు జలంధరుడు ఆ వృత్తాంతమును విని కోపముతో కదలిపోయిన దేహము గలవాడు ఆయెను (7). అపుడు కొపమునకు పూర్తిగా వశమైన మనస్సు గల ఆ రాక్షసవీరుడు రాక్షససైన్యములన్నియు యుద్ధమునకు సన్నథ్ధము కావలెనని ఆదేశించెను (8).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 783🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 20 🌴
🌻 The fight between the Gaṇas and the Asuras - 1 🌻
Vyāsa said:—
1. O omniscient Sanatkumāra, a wonderful story has been narrated by you, wherein the sanctifying sports of Śiva the great lord are included.
2. Now take pity on me and tell me with pleasure. O great sage, when released by that being where did Rāhu go?
Sūta said:—
3. On hearing the words of Vyāsa of immeasurable intelligence, the great sage, the delighted son of Brahmā, replied.
Sanatkumāra said:—
4. Rāhu had been let off in the land of the outcastes.[1] He too became an outcaste and came to be known in the world as such.
5. Considering that as his second birth he became humble. He became free from haughtiness. He slowly wended his way to the city of Jalandhara.
6. After approaching Jalandhara the lord of Daityas, he explained everything concerning Śiva in detail, O Vyāsa.
7. On hearing it, the powerful son of the ocean, the excellent lord of Daityas, Jalandhara became furious from head to foot.
8. Then the infuriated excellent Daitya commanded the entire army of the Daityas to enter into the fray.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments