top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 784 / Sri Siva Maha Purana - 784


🌹 . శ్రీ శివ మహా పురాణము - 784 / Sri Siva Maha Purana - 784 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 20 🌴



🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 2 🌻


జలంధరుడిట్లు పలికెను- కాలనేమి, శుంభుడు, నిశుంభుడు మొదలగు రాక్షసవీరులందరు తమ సైన్యములతో గూడి బయలుదేరెదరు గాక! (9) కోటివీరకులమునందు పుట్టిన వారు, కంబు వంశజాతులు, దౌర్హృదులు, కాలకులు, కాలకేయులు, మౌర్యులు మరియు ధూమ్రులు కూడ బయల్వెడలెదరు గాక! (10) సముద్రపుత్రుడు, ప్రతాపవంతుడు అగు ఆ రాక్షసరాజు ఈ విధముగా ఆజ్ఞాపించి కోట్ల రాక్షసులతో చుట్టు వారబడి యున్నవాడై శీఘ్రముగా బయలు దేరెను (11). ఆతనికి ముందు శుక్రుడు మరియు తెగిన శిరస్సుతో కూడిన రాహువు నడిచిరి. అపుడాతని కిరీటము వేగము వలన జారి భూమిపై పడెను (12). ఆకాశమంతయు వర్షాకాలములో వలె మేఘములతో నిండి ప్రకాశించెను. గొప్ప ఉపద్రవమును సూచించే అపశకునములు అధికముగా బయలు దేరెను (13). ఆతని సైన్యోద్యోగమును పరికించిన ఇంద్రాదిదేవతలు అపుడాతనికి కానరాకుండా శంకరుని నివాసమగు కైలాసమునకు వెళ్లిరి (14). ఇంద్రాది దేవతలు అందరు అచటకు వెళ్లి శివుని దర్శించి తలలు వంచి నమస్కరించి చేతులు జోడించి స్తుతించిరి (15).


దేవతలిట్లు పలికిరి - ఓ దేవదేవా! మహాదేవా! కరుణానిధీ! శంకరా! నీకు నమస్కారమగు గాక! ఓ మహేశ్వరా! శరణు పొందిన మమ్ములను కాపాడుము (16). ఓ ప్రభూ! దేవేంద్రునితో సహా మేమందరము స్థాన భ్రష్టులమై భూమియందు నివసిస్తూ జలంధరుడు చేయుచున్న ఉపద్రవములచే చాల దుఃఖితులమై ఉన్నాము (17).




సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 784🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 20 🌴


🌻 The fight between the Gaṇas and the Asuras - 2 🌻



Jalandhara said:—


9-10. Let all the Asuras such as Kālanemi and others set out with their entire divisions; Śumbha, Niśumbha and other heroes; the descendants of Koṭivīra, the scions of the family of Kambu. Daurhṛdas, Kalakas, Kālakeyas, Mauryas and Dhaumras—let all these start for the fight.


11. After ordering thus, the lord of the Asuras the valorous son of the ocean set out quickly accompanied by crores of Daityas.


12. Then Śukra and Rāhu with his head severed went ahead of him. In his quick jerky movement, his crown became dislodged and fell on the ground.


13. The sky was entirely enveloped by clouds as in the rainy season. Many ill omens occurred portending great slumber.


14. On seeing his enterprise, the gods including Indra went to Kailāsa, the abode of Śiva without being observed.


15. After going there and seeing Śiva, the gods including Indra, bowed to him with stooping shoulders. They joined their palms in reverence and eulogised.



The gods said:—


16. O great lord, lord of the gods, O Śiva the merciful, obeisance be to you. Save us who have sought refuge in you.


17. O lord, we are very much distressed by this harassment. All including Indra are deposed and compelled to stay on the earth.




Continues....


🌹🌹🌹🌹🌹




0 views0 comments

Comments


bottom of page