🌹 . శ్రీ శివ మహా పురాణము - 787 / Sri Siva Maha Purana - 787 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 20 🌴
🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 5 🌻
మహేశ్వరుడిట్లు పలికెను- దేవతలలో శ్రేష్ఠుడవగు ఓ విష్ణూ! నా మాటను నీవు శ్రద్ధతో వినుము. మహారాక్షసుడగు జలంధరుని నిస్సందేహముగా సంహరించగలను (35). నీవు నిర్భయముగా నీ స్థానమునకు వెళ్లుము. ఆ రాక్షసరాజు హతుడైనాడని తలంచి దేవతలు కూడా నిస్సందేహముగా నిర్భయముగా నిశ్చయముగా తమ స్థానములకు వెళ్లెదరు గాక! (36).
సనత్కుమారుడిట్లు పలికెను- మహేశ్వరుని ఈ మాటను విని ఆ లక్ష్మీపతి తొలగిన సంశయములు గల వాడై దేవతలతో గూడి తన స్థానమునకు శీఘ్రముగా చేరుకొనెను (37). ఓ వ్యాసా! ఇంతలో మహాపరాక్రమ శాలి, బలశాలి అగు ఆ రాక్షసరాజు యుద్ధ సన్నద్ధులైన రాక్షసులతో గూడి కైలాసపర్వత సమీపమునకు చేరెను (38). యమునితో సమమగు ఆ జలంధరుడు పెద్దసేనతో గూడిన వాడై కైలాసమును ముట్టడించి సింహనాదమును చేయుచూ ఉత్కర్ష గల వాడై స్థిరముగా నుండెను (39). గొప్ప లీలలు గలవాడు, దుష్టసంహారకుడు అగు శివుడు రాక్షసుల సింహనాదమునుండి బయల్వెడలిన ఆ కోలాహలమును విని అపుడు మిక్కిలి కోపించెను (40). గొప్ప లీలలు గలవాడు, యుద్ధమునందు ఉత్సాహము గలవాడు, పాపహారి అగు మహాదేవుడు మహాబలశాలురగు నంది మొదలైన తన గణములను యుద్ధమునకు ఆదేశించెను (41). నంది, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి మొదలగు గణములందరు శివుని ఆజ్ఞచే మిక్కిలి వేగముతో యుద్ధమునకు సన్నద్ధులైరి. (42). క్రోధముచే మిక్కిలి మదించి ఉన్న మహావీరులగు గణములందరు సింహనాదములను చేయుచూ యుద్ధము కొరకై కైలాసమునుండి క్రిందకు దిగిరి (43).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 787 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 20 🌴
🌻 The fight between the Gaṇas and the Asuras - 5 🌻
The great lord Śiva said:—
35. O Viṣṇu, foremost among the gods, please listen to my words attentively. I will kill the great Daitya Jalandhara. There is no doubt about this.
36. Go back to your abode fearlessly. Let the gods too go back without fear and hesitation, considering the ruler of the Asuras already killed.
Sanatkumāra said:—
37. On hearing the words of lord Śiva, the lord of Lakṣmī immediately went to his abode without doubts along with the gods.
38. In the meantime, O Vyāsa, that valorous king of the Daityas went along with the well-equipped Asuras to the outskirts of the mountain.
39. Accompanied by a vast army he laid siege to Kailāsa. He stood there like the god of death roaring like a lion.
40. On hearing the tumultuous roar of the Daityas, lord Śiva of great sports, the destroyer of the wicked, became very furious.
41. The great lord of various sports, the enthusiastic Śiva commanded his powerful Gaṇas, Nandin and others, severally.
42. Nandin, Vighneśvara, Kumāra and all other Gaṇas, at the bidding of Śiva hurriedly got ready for the battle.
43. The infuriated and invincible Gaṇas descended from Kailāsa heroically shouting war cries and leaping to fight.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments